logo

రెండు మతాచారాల ప్రకారం వివాహం

కోయంబత్తూరు జిల్లాలో డీఎసీగా పనిచేస్తున్న వెట్రి సెల్వన్‌ కుమార్తె నిశాంతితో తిరునెల్వేలి జిల్లాకు చెందిన సుదర్శన్‌ వివాహం బుధవారం నిర్వహించారు.

Updated : 26 May 2023 05:16 IST

సాదర విందులో  పాల్గొన్న మత గురువులు

కోయంబత్తూరు, న్యూస్‌టుడే: కోయంబత్తూరు జిల్లాలో డీఎసీగా పనిచేస్తున్న వెట్రి సెల్వన్‌ కుమార్తె నిశాంతితో తిరునెల్వేలి జిల్లాకు చెందిన సుదర్శన్‌ వివాహం బుధవారం నిర్వహించారు. పేరూర్‌ ఆధీనం శాంతలింగం అడిగళార్‌, కౌమార మతాలయం గురు మహా సన్నిధానం రామానంద కుమార గురు పరంపర స్వామి, కామాక్షి పూరీ ఆధీనం శివలింగేశ్వర స్వామి, బోతనూర్‌ ఇమామ్‌ ఇబ్రహీం, సున్నత్‌జమాత్‌, అడిషనల్‌ డైరెక్టరు మేళావి అల్లాజ్‌ అబ్దుల్‌ రహీం, జిల్లా ఎస్పీ బద్రీనారాయణ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమలో మత పెద్దలు శివపురాణం, ఖురాన్‌ పఠించి నూతన దంపతులను ఆశీర్వదించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు