బడులకు సెలవుల పొడిగింపు
వేసవి ఎండలు దృష్ట్యా పుదుచ్చేరిలోని పాఠశాలలకు సెలవులు పొడిగిస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి నమశివాయం తెలిపారు. పుదుచ్చేరి శాసనసభ ప్రాంగణంలోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు.
విలేకర్లతో మాట్లాడుతున్న నమశివాయం
చెన్నై, న్యూస్‌టుడే: వేసవి ఎండలు దృష్ట్యా పుదుచ్చేరిలోని పాఠశాలలకు సెలవులు పొడిగిస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి నమశివాయం తెలిపారు. పుదుచ్చేరి శాసనసభ ప్రాంగణంలోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఎండల తీవ్రత కారణంగా తమిళనాడు తరహాలో పుదుచ్చేరిలోనూ పాఠశాలల సెలవులను పొడించాలంటూ పలు వర్గాలు నుంచి అభ్యర్థనలు వచ్చాయని తెలిపారు. ఆ మేరకు జూన్ 1కి బదులుగా 7న పుదుచ్చేరి, కారైకాల్, మాహే, యానాం ప్రాంతాల్లో పాఠశాలలను తెరవనున్నట్టు తెలిపారు. నిబంధనలు సవరించి ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ పాఠ్యప్రణాళికకు అనుమతించాలన్న తమ అభ్యర్థన ఆ మేరకు పుదుచ్చేరిలోని 127 ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ అమలుకు అనుమతి లభించిందని పేర్కొన్నారు. ఆ పాఠ్యప్రణాళిక పుస్తకాలను కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. తొలివిడతగా కారైకాల్, మాహే, యానాం ప్రాంతాలకు పాఠ్యపుస్తకాలను పంపగా పుదుచ్చేరిలో పాఠశాలలు తెరిచిన మొదటి రోజు అందిస్తామని పేర్కొన్నారు. ఉచిత యూనిఫారం, సైకిళ్లు అందిస్తున్న నేపథ్యంలో ఒకటిన్నర నెలలోపు ల్యాప్‌టాప్‌లూ అందించడానికి చర్యలు చేపట్టినట్టు తెలిపారు. సీబీఎస్‌ఈ పాఠ్యప్రణాళికలో తమిళం ఐచ్ఛిక పాఠ్యాంశంగా ఉంటోందని పేర్కొన్నారు. రాష్ట్ర పాఠ్యప్రణాళికలో కొనసాగే ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని తెలిపారు. జాతీయ పరీక్షలైన నీట్, జేఈఈలో ఉత్తీర్ణత సాధించడానికి సీబీఎస్‌ఐ పాఠ్యప్రణాళిక తప్పనిసరి అవుతోందని, అందువల్లే ఆ పాఠ్యప్రణాళికకు ప్రభుత్వం మారుతోందని వెల్లడించారు. వెంట విద్యాశాఖ సంచాలకులు ప్రియదర్శిని, సంయుక్త సంచాలకులు శివకామి ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
BJP: ఏపీలో మద్యం అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతాం: పురంధేశ్వరి
-
Sai pallavi: ఇంతకన్నా నీచం మరొకటి ఉండదు.. పెళ్లి రూమర్స్‌పై సాయిపల్లవి ట్వీట్
-
Stock Market: నాలుగోరోజూ నష్టాల్లోనే.. 19,700 దిగువకు నిఫ్టీ
-
Sapta Sagaralu Dhaati Movie Review: రివ్యూ: సప్త సాగరాలు దాటి - సైడ్ ఎ
-
Congress: జగన్ నిరంకుశ పాలనకు ఇది నిదర్శనం: గిడుగు రుద్రరాజు
-
NCP : శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయండి.. స్పీకర్‌ను కోరిన అజిత్ మద్దతుదారులు