వైభవంగా రథోత్సవం
పుదుచ్చేరి ప్రాంతీయం కారైకాల్ జిల్లా తిరునళ్లారులోని ప్రణాంబిక సమేత దర్బారణ్యేశ్వర స్వామి ఆలయం రథోత్సవం వైభవంగా జరిగింది.
వేడుకలో పాల్గొన్న భక్తులు
చెన్నై, న్యూస్‌టుడే: పుదుచ్చేరి ప్రాంతీయం కారైకాల్ జిల్లా తిరునళ్లారులోని ప్రణాంబిక సమేత దర్బారణ్యేశ్వర స్వామి ఆలయం రథోత్సవం వైభవంగా జరిగింది. ఆలయంలో 16వ తేదీ బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో కీలక ఘట్టమైన రథోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. త్యాగరాజ స్వామి, షెన్బగ త్యాగరాజ స్వామి, నీలోద్బాలంబాళ్, వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి, చండికేశ్వరుడు తదితరులు ఉన్న నాలుగు రథాలు పాటు దర్బారణ్యేశ్వర స్వామి కొలువైన రథానికి పూజలు, దీపారాధన కార్యక్రమాలు నిర్వహించారు. తర్వాత ప్రధాన రథాన్ని పుదుచ్చేరి మంత్రి సాయి శరవణన్‌కుమార్, కారైకాల్ కలెక్టరు కులోత్తుంగన్, ఎమ్మెల్యే శివ, ఆలయ అధికారులు తదితరులు లాగి రథోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భక్తులు పాల్గొని స్వామి దర్శనం చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Stock Market: నాలుగోరోజూ నష్టాల్లోనే.. 19,700 దిగువకు నిఫ్టీ
-
Sapta Sagaralu Dhaati Movie Review: రివ్యూ: సప్త సాగరాలు దాటి - సైడ్ ఎ
-
Congress: జగన్ నిరంకుశ పాలనకు ఇది నిదర్శనం: గిడుగు రుద్రరాజు
-
NCP : శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయండి.. స్పీకర్ను కోరిన అజిత్ మద్దతుదారులు
-
Weather Report: తెలంగాణలో 3రోజుల పాటు వర్షాలు
-
Flight Fares: భారత్-కెనడాల మధ్య ఉద్రిక్తతలు.. విమాన టికెట్ ధరలకు రెక్కలు