logo

ఆంగ్ల నైపుణ్యం పెంపునకు యాప్‌

‘కారడి పాత్‌ ఎడ్యుకేషన్‌’ సంస్థతో కలిసి ‘తమిళనాడు స్టేట్ ఛైల్డ్‌ ప్రొటెక్షన్‌ సొసైటీ’ ఆంగ్ల నైపుణ్య పథకాన్ని మంగళవారం ప్రారంభించింది.

Updated : 31 May 2023 05:20 IST

యాప్‌ను ప్రారంభిస్తున్న దృశ్యం

వడపళని, న్యూస్‌టుడే: ‘కారడి పాత్‌ ఎడ్యుకేషన్‌’ సంస్థతో కలిసి ‘తమిళనాడు స్టేట్ ఛైల్డ్‌ ప్రొటెక్షన్‌ సొసైటీ’ ఆంగ్ల నైపుణ్య పథకాన్ని మంగళవారం ప్రారంభించింది. ‘మేజిక్‌ ఇంగ్లిష్‌ లెర్నింగ్‌ బుడ్డి’ పేరిట టీచర్స్‌ ఆండ్రాయిడ్‌ యాప్‌తో ప్రారంభమైన ఈ ప్రాజెక్టుతో 1,500 మంది విద్యార్థులు, వంద మంది ఉపాధ్యాయులు లబ్ధి పొందనున్నారు. రాష్ట్ర ఛైల్డ్‌ ప్రొటెక్షన్‌ సొసైటీ, డైరెక్టర్‌ ఆఫ్‌ సోషియల్‌ డిఫెన్స్‌ డైరెక్టర్‌ అమర్‌ కుశావా దీనిని ప్రారంభించారు. సొసైటీ అండ్‌ స్టేట్ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ ఛైల్డ్‌ రైట్ జాయింట్ డైరెక్టర్‌ రాజ్‌ శ్రావణకుమార్‌, కారడి పాత్‌ ఎడ్యుకేషన్‌ సంస్థ ఎండీ సీపీ విశ్వనాథ్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. చెన్నై, విల్లుపురం, రాణిపేట, వేలూరు, శివగంగై, విరుదునగర్‌, తూత్తుకుడి, నీలగిరి, పుదుక్కోట్టై, తెన్‌కాశి కోయంబత్తూరు తదితర 24 జిల్లాల్లో కూడా దీన్ని అమలు చేయాలనుకుంటున్నట్టు అధికారులు తెలిపారు.  

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని