logo

ఆధునిక వాహనాల ప్రారంభం

ఆధునిక కెమెరాలు అమర్చిన గస్తీ వాహనాలను ప్రారంభించిన చెన్నై పోలీసు కమిషనరు శంకర్‌ జివాల్‌, ట్రాఫిక్‌ పోలీసులకు బుధవారం పరికరాలు అందించారు.

Published : 01 Jun 2023 00:20 IST

గస్తీ వాహనాన్ని ప్రారంభిస్తున్న కమిషనరు శంకర్‌ జివాల్‌

ప్యారిస్‌, న్యూస్‌టుడే: ఆధునిక కెమెరాలు అమర్చిన గస్తీ వాహనాలను ప్రారంభించిన చెన్నై పోలీసు కమిషనరు శంకర్‌ జివాల్‌, ట్రాఫిక్‌ పోలీసులకు బుధవారం పరికరాలు అందించారు. రోడ్డు భద్రత గురించి ప్రజలకు అవగాహన కల్పించి, ట్రాఫిక్‌ నిబంధనలు మెరుగు పరిచేందుకు గ్రేటర్‌ చెన్నై ట్రాఫిక్‌ పోలీసులు పలు చర్యలు చేపట్టి అమలు పరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ట్రాఫిక్‌ పోలీసులకు బ్రీత్‌ అనలైజర్‌, ట్రైపాడ్‌ కెమెరా, వాహన ఇంటర్‌ సెప్టర్‌ సిస్టమ్‌, బారిగేడు బ్లింకర్‌ లైట్‌, బటన్‌ లైట్‌ విత్‌ చార్జర్‌, బీఎమ్‌ఎస్‌ బోర్డు, మెగా ఫోన్‌, సా మెషిన్‌ వంటి వాటిని అందించారు. ఈ కార్యక్రమం చెన్నై అన్నాస్క్వేర్‌  వద్ద ఉన్న చిల్డ్రన్స్‌ రోడ్‌ సేఫ్టీ అండ్‌ ట్రాఫిక్‌ పార్కులో జరిగింది. అదేవిధంగా అత్యాధునిక సాంకేతిక కెమెరాలను అమర్చిన మోడ్రన్‌ ఇంటర్‌ సెప్టర్‌ వాహనాలను ప్రారంభించారు. చిల్డ్రన్స్‌ రోడ్‌ సేఫ్టీ అండ్‌ ట్రాఫిక్‌ పార్కులో విద్యార్థులకు రహదారి భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించి సైకిళ్లు అందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనరు (ట్రాఫిక్‌) కపిల్‌ కుమార్‌ సి సరాట్కర్‌, సహాయ కమిషనర్లు (ట్రాఫిక్‌) శరవణన్‌, శక్తివేల్‌ తదితరులు పాల్గొన్నారు.


విద్యార్థులకు రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పిస్తున్న దృశ్యం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని