logo

నిర్బంధ తమిళం అమలుకు వినతి

పుదుచ్చేరిలో నిర్బంధ తమిళాన్ని అమలు చేయాలంటూ ముఖ్యమంత్రి రంగస్వామికి పలు సంఘాల ప్రతినిధులు వినతిపత్రం అందించారు.

Published : 01 Jun 2023 00:20 IST

వినతిపత్రాన్ని పరిశీలిస్తున్న రంగస్వామి

చెన్నై, న్యూస్‌టుడే: పుదుచ్చేరిలో నిర్బంధ తమిళాన్ని అమలు చేయాలంటూ ముఖ్యమంత్రి రంగస్వామికి పలు సంఘాల ప్రతినిధులు వినతిపత్రం అందించారు. పుదుచ్చేరిలోని ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ పాఠ్యప్రణాళికను అమలు చేయనున్న విషయం తెలిసిందే. ఈ పాఠ్యప్రణాళికలో తమిళం ఐచ్ఛికంగా ఉంటుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మక్కళ్‌ ఉరిమై కూట్టమైపు కార్యదర్శి సుకుమారన్‌ అధ్యక్షతన పలు సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి రంగస్వామిని కలిశారు. నిర్బంధ తమిళాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ వినతిపత్రం అందించారు. ఇప్పటికే పలు వర్గాలు నుంచి డిమాండ్లు వెల్లువెత్తడంతో దీనిపై విద్యాశాఖ మంత్రి నమశివాయం, విద్యాశాఖ కార్యదర్శి జవహర్‌తో రంగస్వామి చర్చలు జరపగడం గమనార్హం. నిర్బంధ తమిళం వైపు తమ ప్రభుత్వం కూడా మొగ్గు చూపుతోందని రంగస్వామి వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని