logo

వినోదభరితం.. జుగల్బందీ నాటకం

స్టేజ్‌ క్రియేషన్స్‌ ప్రదర్శించిన జుగల్బందీ సాంఘిక నాటకం వినోదభరితంగా ఉందని నాటకాభిమానులు కొనియాడారు.

Published : 02 Jun 2023 01:00 IST

నాటకంలో పతాక సన్నివేశం

చెన్నై (సాంస్కృతికం), న్యూస్‌టుడే: స్టేజ్‌ క్రియేషన్స్‌ ప్రదర్శించిన జుగల్బందీ సాంఘిక నాటకం వినోదభరితంగా ఉందని నాటకాభిమానులు కొనియాడారు. మైలాపూరు భారతీయ విద్యాభవన్‌ చెన్నై కేంద్రం ప్రాంగణంలోని పొట్టిపాట్టి జ్ఞానాంబ ఓబుల్‌రెడ్డి హాలులో చివరి నాటకంగా బుధవారం రాత్రి ఈ నాటక ప్రదర్శన ఏర్పాటైంది. కథ, సంభాషణలు, దర్శకత్వ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన ఎస్‌ఎల్‌ నాను ప్రధాన పాత్రను కూడా ప్రతిభావంతంగా పోషించి నాటక విజయానికి పునాది వేశారు. 8 పదుల నిండిన ప్రముఖ నటుడు కాత్తాడి రామమూర్తి అద్వితీయ నటనతో ఆద్యంతం ప్రేక్షకులను నవ్వులు కురిపించారు. ఇంకా ఈ నాటకంలో శ్రీనివాస్‌, అను సురేష్‌, గీతానారాయణలు కూడా తమ పాత్రల్లో పూర్తిగా ఒదిగిపోయారు. సైదై కుమార్‌ రంగాలంకరణ, మయిలై బాబు కాంతి ప్రసరణ, చరణ్‌ నేపథ్య సంగీతం నాటకాన్ని మరింత పసందుగా మలిచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు