హోర్డింగ్ కూలి ముగ్గురి మృతి
హోర్డింగ్ కూలిపడిన ప్రమాదంలో ముగ్గురు మృతిచెందిన ఘటన కోయంబత్తూరులో చోటుచేసుకుంది. కోయంబత్తూరు జిల్లా కరుమత్తంపట్టి పంచాయతీకి చెందిన అవినాశి మెయిన్ రోడ్డులో గురువారం హోర్డింగ్ ఏర్పాటు చేసే పనిని సిబ్బంది చేపట్టారు.
ఘటనాస్థలి
ప్యారిస్, న్యూస్‌టుడే: హోర్డింగ్ కూలిపడిన ప్రమాదంలో ముగ్గురు మృతిచెందిన ఘటన కోయంబత్తూరులో చోటుచేసుకుంది. కోయంబత్తూరు జిల్లా కరుమత్తంపట్టి పంచాయతీకి చెందిన అవినాశి మెయిన్ రోడ్డులో గురువారం హోర్డింగ్ ఏర్పాటు చేసే పనిని సిబ్బంది చేపట్టారు. ఆ సమయంలో బలంగా ఈదురుగాలుల వీచడంతో అకస్మాత్తుగా హోర్డింగ్ కూలింది. ముగ్గురు యువకులు ఘటనాస్థలిలోనే మృతిచెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు వారిని చికిత్స నిమిత్తం పక్కనే ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. హోర్డింగ్‌ని ఏర్పాటు చేసే కాంట్రాక్ట్‌ని సేలానికి చెందిన పళనిస్వామి తీసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. మృతిచెందిన వారి వివరాల కోసం కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/09/23)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Damini bhatla: ఊహించని ట్విస్ట్.. బిగ్‌బాస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్
-
Sudhamurthy: నా పేరును దుర్వినియోగం చేస్తున్నారు.. పోలీసులకు సుధామూర్తి ఫిర్యాదు
-
Raghava Lawrence: ఆయన లేకపోతే ఈ వేదికపై ఉండేవాణ్ని కాదు: లారెన్స్
-
Mla Rajaiah: కాలం నిర్ణయిస్తే బరిలో ఉంటా: ఎమ్మెల్యే రాజయ్య