logo

రైతులకు రాయితీ ఉత్తర్వులు

పుదుచ్చేరి వ్యవసాయశాఖ తరఫున వ్యవసాయ పనిముట్ల కొనుగోలుకు రైతులకు సబ్సిడీ ఉత్తర్వుల అందజేతను ముఖ్యమంత్రి రంగస్వామి ప్రారంభించారు.

Published : 02 Jun 2023 02:57 IST

ఉత్తర్వులు అందిస్తున్న ముఖ్యమంత్రి రంగస్వామి

చెన్నై, న్యూస్‌టుడే: పుదుచ్చేరి వ్యవసాయశాఖ తరఫున వ్యవసాయ పనిముట్ల కొనుగోలుకు రైతులకు సబ్సిడీ ఉత్తర్వుల అందజేతను ముఖ్యమంత్రి రంగస్వామి ప్రారంభించారు. ఈ ఏడాది ట్రాక్టర్‌, వరి నాట్ల యంత్రాలు, అభివృద్ధిపరచిన వ్యవసాయ ఉపకరణాలను రైతులు కొనుగోలు చేసేందుకు రూ.2.24 కోట్ల సబ్సిడీ పథకాన్ని పుదుచ్చేరి ప్రభుత్వం అమలు చేయనుంది. లబ్ధిదారులకు సబ్సిడీ ఉత్తర్వుల అందజేతను ముఖ్యమంత్రి రంగస్వామి గురువారం ప్రారంభించారు. సచివాలయంలోని తన గదిలో ఏడుగురు లబ్ధిదారులకు ఉత్తర్వులు అందించారు. కార్యక్రమంలో సభాపతి సెల్వం, మంత్రి జయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని