సెంథిల్‌బాలాజీని అరెస్టు చేయాలి
మంత్రి సెంథిల్‌బాలాజీని అరెస్ట్ చేయాలని డీఎండీకే కోశాధికారి ప్రేమలత విజయకాంత్ అన్నారు.
ప్రేమలత విజయకాంత్
ఆర్కేనగర్, న్యూస్‌టుడే: మంత్రి సెంథిల్‌బాలాజీని అరెస్ట్ చేయాలని డీఎండీకే కోశాధికారి ప్రేమలత విజయకాంత్ అన్నారు. కులదైవాన్ని దర్శించుకునేందుకు చెన్నై నుంచి మదురై విమానాశ్రయానికి విచ్చేసిన ఆమె విలేకరులతో మాట్లాడుతూ.... మల్లయుద్ధ క్రీడాకారిణిలు పోరాడుతూనే ఉన్నారన్నారు. ఇండియా కోసం ఆడిన క్రీడాకారిణిలకు ఎలాంటి భద్రత లేదన్నారు. వారి శాఖకు చెందినవారి ద్వారా లైంగిక వేధింపులకు గురిచేయడం ఖండించదగినదని తెలిపారు. వారికి మంచి తీర్పునివ్వాలన్నారు. మెగదాటు ఆనకట్ట నిర్మించేందుకు ఏ తమిళుడు అనుమతించడని అన్నారు. ఈ వ్యవహారంలో ఇరు రాష్ట్రాల మధ్య అతిపెద్ద ఘర్షణ ఏర్పడుతుందని చెప్పారు. సోదాలకు వచ్చే అధికారులు చెప్పిరారని అన్నారు. అధికారులపై దాడి చేయడాన్ని ఖండించదగినదన్నారు. ఈ వ్యవహారంలో మంత్రి సెంథిల్‌బాలాజీని అరెస్ట్ చేయాలని పేర్కొన్నారు. అధికారులు విధులు నిర్వహించకుండా అడ్డుకున్న వారికి ఇది ఒక గుణపాఠంగా ఉండాలన్నారు. రూ.వెయ్యి కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చినట్లు ముఖ్యమంత్రి అన్నారని, ఈ విషయంలో జిల్లాలకు ఎన్ని పరిశ్రమలు, ఉద్యోగవకాశాలు వస్తాయో వేచిచూద్దామని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ఇంటికో కట్టె తెచ్చి.. శ్మశానానికి హద్దుపెట్టి!
-
Damini bhatla: ఊహించని ట్విస్ట్.. బిగ్బాస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్
-
Cyber Crimes: టాస్క్ పేరుతో సైబర్ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర హోంశాఖ
-
Sudhamurthy: నా పేరును దుర్వినియోగం చేస్తున్నారు.. పోలీసులకు సుధామూర్తి ఫిర్యాదు
-
Social Look: విజయ్ దేవరకొండ ఐస్ బాత్.. మీనాక్షి స్టన్నింగ్ లుక్.. ఐశ్వర్య బ్రైడల్ పోజ్
-
Raghava Lawrence: ఆయన లేకపోతే ఈ వేదికపై ఉండేవాణ్ని కాదు: లారెన్స్