logo

బ్రిజ్‌ భూషణ్‌ అరెస్టుకు డిమాండ్‌

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జాతీయ రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు, భాజపా ఎంపీయైన బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను అరెస్టు చేయాలంటూ నగరంలో శుక్రవారం ఆందోళన జరిగింది.

Published : 03 Jun 2023 00:43 IST

అశోక్‌నగర్‌లో ఆందోళన చేస్తున్న దృశ్యం

చెన్నై, న్యూస్‌టుడే: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జాతీయ రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు, భాజపా ఎంపీయైన బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను అరెస్టు చేయాలంటూ నగరంలో శుక్రవారం ఆందోళన జరిగింది. అశోక్‌నగర్‌లోని తపాలా కార్యాలయం ఎదుట జరిగిన ఆందోళనను ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐడబ్ల్ల్యూఏ, డీవైఎఫ్‌ఐ సంయుక్తంగా నిర్వహించాయి. బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ, ఇప్పటివరకు అతనిపై చర్యలు చేపట్టలేదంటూ కేంద్రం సర్కారును ఖండిస్తూ నినదించారు. ఏఐడబ్ల్ల్యూఏ రాష్ట్ర కోశాధికారి ప్రమిళ తదితరులు ఆందోళన ఉద్దేశం గురించి ప్రసంగించారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు