జాతీయ రహదారి పనుల్లో మార్పులు
చెన్నై - బెంగళూరు హైవేలోని మధురవోయల్ - శ్రీపెరుంబుదూరు సెక్షనులో మూడు పైవంతెనలు, వెహికులర్ అండర్‌పాస్ నిర్మాణాన్ని ‘నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా’ (ఎన్‌హెచ్‌ఏఐ) ఉపసంహరించుకుంది.
వడపళని, న్యూస్‌టుడే: చెన్నై - బెంగళూరు హైవేలోని మధురవోయల్ - శ్రీపెరుంబుదూరు సెక్షనులో మూడు పైవంతెనలు, వెహికులర్ అండర్‌పాస్ నిర్మాణాన్ని ‘నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా’ (ఎన్‌హెచ్‌ఏఐ) ఉపసంహరించుకుంది. రాష్ట్ర హైవే విభాగంలోని నేషనల్ హేవేస్ విభాగం ఈ మార్గంలో నిర్మాణానికి చర్యలు చేపట్టింది. 23.2 కి.మీ పొడవు మార్గంలో మూడు పైవంతెనలు, ఆరువరుసల నిర్మాణాన్ని రాష్ట్ర హైవేస్ విభాగ ఆధ్వర్యంలోని ఎన్‌హెచ్ విభాగం నిర్మాణం జరపనుంది. రద్దీ ప్రాంతమైన పారివాక్కం, తిరుమళిసై, తండలం, నజరత్‌పేట్లో ఈ ప్రాజెక్టు జరగనుంది. చెన్నైలోని టీఎన్ - ఎన్‌హెచ్‌ఏఐ చీఫ్ జనరల్ మేనేజరు షియో శంకర్ ఝాకు చెన్నై ఎన్‌హెచ్‌ఏఐ రీజినల్ ఆఫీసర్ ఎస్పీ సోమశేఖర్ ఈ ఏడాది మార్చి 16న లేఖ రాశారు. రాష్ట్ర హైవేస్ విభాగంలోని ఎన్‌హెచ్ విభాగం రూ.394.06 కోట్ల వ్యయంతో మార్పులు చేసిన డిజైన్‌ను సమర్పించారు. పైవంతెనలు, వీయూపీ నిర్మాణం జరిగితే మొత్తంమీద ప్రాజెక్టుకయ్యే ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుందన్నారు. ప్రతిపాదించిన పైవంతెన, వీయూపీ ప్రాంతంలో పునాది, అనుబంధ నిర్మాణం జరపాలనుకున్నప్పటికీ అది కష్టతరమేనన్నారు. పారివాక్కం, నజరత్‌పేట్, తిరుమళిసై, తండలంలోని నాలుగు కూడళ్లలో గ్రేడ్ అభివృద్ధిపై జాతీయ రహదారుల సీఈ అధికారులకు సూచించారు. దిల్లీలో గత నెల 23, 24 తేదీల్లో ఎన్‌హెచ్‌ఏఐ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో రోడ్డు వెడల్పు, వీయూపీ, పైవంతెనల విస్తరణపై చేసిన ప్రతిపాదనలను కూడా అనుమతించింది. సబర్బన్ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, పెరుగుతున్న ట్రాఫిక్, భవిష్యత్తులో ఆ ప్రాంతంలో పెరిగే ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఉన్న మార్గంలో నాలుగు ప్రవేశ, బయటికెళ్లే దారులున్నాయి. ఉద్యోగులు, విద్యార్థులను బస్సులు హైవే మార్గం కాకుండా ఈ మార్గం గుండానే తీసుకెళ్తున్నాయి. కనుక ట్రాఫిక్ రద్దీ కూడా కొనసాగుతుందని అధికారి అన్నారు. పూనమల్లి డీఎంకే శాసనసభ్యుడు కృష్ణస్వామి మాట్లాడుతూ... ఆరువరుసల నిర్మాణ పనులు పూర్తయ్యాక పైవంతెనలు, అండర్‌పాస్ నిర్మాణం చేపడతామన్నారని తెలిపారు. అయితే నిర్మాణాన్ని ఉపసంహరించుకున్నట్టు తనకు తెలియదని, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Canada MP: ‘కెనడా హిందువుల్లో భయం’.. ట్రూడోపై సొంతపార్టీ ఎంపీ ఆర్య విమర్శలు..!
-
‘NEET PG అర్హత మార్కులు.. వారికోసమే తగ్గించారా?’: కాంగ్రెస్
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
TTD: వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. చంద్రప్రభ వాహనంపై శ్రీనివాసుడు
-
Chandrababu Arrest: అమీర్‌పేటలో చంద్రబాబుకు మద్దతుగా భారీ ర్యాలీ
-
Apply Now: సీబీఎస్ఈ ‘సింగిల్ గర్ల్ చైల్డ్’ మెరిట్ స్కాలర్షిప్.. దరఖాస్తు చేశారా?