logo

32 మంది సమాచారం లేదు రైల్వే ఎస్పీ పొన్‌రాం

కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణించిన రాష్ట్రానికి చెందిన ప్రయాణికుల్లో 32 మంది గురించి సమాచారం లేదని రైల్వే ఎస్పీ పొన్‌రాం తెలిపారు.

Published : 04 Jun 2023 01:27 IST

చెన్నై, న్యూస్‌టుడే: కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణించిన రాష్ట్రానికి చెందిన ప్రయాణికుల్లో 32 మంది గురించి సమాచారం లేదని రైల్వే ఎస్పీ పొన్‌రాం తెలిపారు. చెన్నై సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. చెన్నైలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌లో పోలీసుశాఖ, ఆర్పీఎఫ్‌ తరఫున ఒక్కో డీఎస్పీ, జిల్లా రెవెన్యూ అధికారి నియమితులయ్యారని తెలిపారు. పోలీసుశాఖకు చెందిన 200 మంది, 20 మంది కమాండోలు కలిగిన ఓ బృందం చెన్నై సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌లో భద్రతా విధుల్లో పాల్గొన్నట్టు పేర్కొన్నారు. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో రాష్ట్రానికి చెందిన 132 మంది రిజర్వేషన్‌ బోగీల్లో ప్రయాణించినట్టు తెలిసిందన్నారు. ఫోన్‌ నంబర్ల ద్వారా వారిని సంప్రదించే ప్రయత్నాలు చేయగా 100 మంది సురక్షితంగా ఉన్నట్టు తెలిసిందని వెల్లడించారు. 32 మంది గురించి ఎలాంటి సమాచారం లేదన్నారు. బాధితుల వివరాల సేకరణలో అంతరాయం కలగకుండా ఉండేందుకు సమన్వయంతో పనిచేస్తున్నామని తెలిపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని