బస్సు డ్రైవరుకు గుండెపోటు 62 మంది ప్రాణాలు కాపాడిన వైనం
గుండెపోటుకు గురైనా బస్సులోని 62 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడి డ్రైవరు ప్రాణాలు విడిచిన ఘటన మదురైలో చోటుచేసుకుంది.
ప్యారిస్, న్యూస్‌టుడే: గుండెపోటుకు గురైనా బస్సులోని 62 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడి డ్రైవరు ప్రాణాలు విడిచిన ఘటన మదురైలో చోటుచేసుకుంది. మదురై అయిరాదనల్లూర్‌కి చెందిన మురుగేశ్ రాజా (53) మదురై సిప్కాట్ ప్రభుత్వ బస్సు డిపోలో 12 ఏళ్లుగా డ్రైవరుగా పని చేస్తున్నాడు. శుక్రవారం బస్సు మదురై మాట్టుత్తావణి నుంచి తిరుచ్చెందూర్ వెళ్లి అక్కడి నుంచి 62 మంది ప్రయాణికులతో మళ్లీ మదురైకి బయలుదేరింది. అరుప్పుకోట్టై వద్ద వస్తుండగా అకస్మాత్తుగా మురుగేశ్‌రాజాకి గుండెపోటు వచ్చింది. ఆ సమయంలో బస్సులో 62 మంది ప్రయాణికులు ఉన్నారు. దీంతో బస్సుని నెమ్మదిగా నడిపి ఆపడానికి యత్నించాడు. గమనించిన కండక్టర్ తిరుపతి వెంటనే బ్రేక్ వేసి బస్సుని ఆపాడు. అనంతరం మురుగేశ్ రాజా స్పృహకోల్పోయాడు. వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
UPPAL Stadium: ఆటతో అదిరేలా.. ఉప్పల్ ఊగేలా!
-
Kushi Ott Release: ఓటీటీలోకి ‘ఖుషి’ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
India Canada Row: ‘భారత్-కెనడా వివాదం.. అమెరికా తలదూర్చకపోవచ్చు’
-
Chandrababu: రెండోరోజు కొనసాగుతున్న చంద్రబాబు సీఐడీ విచారణ
-
Tirumala: తిరుమలలో తితిదే ఎలక్ట్రిక్ బస్సు చోరీ
-
Rakshit Shetty: అతడి సంగతి నాకు తెలియదు.. నేనైతే రష్మికతో మాట్లాడుతున్నా: రక్షిత్శెట్టి