రాష్ట్ర ప్రయాణికులతో సంప్రదింపులు
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించిన రాష్ట్రానికి చెందిన ప్రయాణికులతో మాట్లాడినట్లు రెవెన్యూ, విపత్తు నిర్వహణశాఖ మంత్రి కేకేఎస్‌ఎస్‌ఆర్ రామచంద్రన్ తెలిపారు.
వార్ రూంలో పరిస్థితిని సమీక్షిస్తున్న రామచంద్రన్
చెన్నై, న్యూస్‌టుడే: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించిన రాష్ట్రానికి చెందిన ప్రయాణికులతో మాట్లాడినట్లు రెవెన్యూ, విపత్తు నిర్వహణశాఖ మంత్రి కేకేఎస్‌ఎస్‌ఆర్ రామచంద్రన్ తెలిపారు. ఒడిశాలో రైలు దుర్ఘటన నేపథ్యంలో ఎళిలగంలోని వార్ రూంలో పరిస్థితిని మంత్రి రామచంద్రన్ సమీక్షించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. ఒడిశాలో కోరమాండల్ రైలు ప్రమాద నేపథ్యంలో రాష్ట్ర భాష తెలిసిన ప్రభుత్వ అధికారులను దుర్ఘటన ప్రాంతానికి పంపినట్టు తెలిపారు. సహాయక చర్యలు పూర్తయిన తర్వాతే మృతుల్లో రాష్ట్రానికి చెందినవారి సంఖ్య స్పష్టంగా తెలుస్తుందని పేర్కొన్నారు. మృతుల్లో రాష్ట్రానికి చెందిన వారుంటే మృతదేహాలను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. రెండు రోజుల పాటు వార్ రూమ్‌లోనే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షించనున్నట్టు తెలిపారు. ఘటనా స్థలి నుంచి 8 మంది వార్ రూమ్‌ను సంప్రదించారని, కోరమండల్ రైలులోని రాష్ట్రానికి చెందిన 127 మంది ప్రయాణికులతో ఇప్పటివరకు మాట్లాడినట్టు తెలిపారు. హౌరా రైలులోని ఐదుగురితో మాట్లాడినట్లు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
IND vs AUS: ఆసీస్‌పై ఆల్‌రౌండ్ షో.. టీమ్ఇండియా ఘన విజయం
-
Bennu: నాసా ఘనత.. భూమి మీదికి గ్రహశకలం నమూనాలు!
-
Canada MP: ‘కెనడా హిందువుల్లో భయం’.. ట్రూడోపై సొంతపార్టీ ఎంపీ ఆర్య విమర్శలు..!
-
‘NEET PG అర్హత మార్కులు.. వారికోసమే తగ్గించారా?’: కాంగ్రెస్
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
TTD: వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. చంద్రప్రభ వాహనంపై శ్రీనివాసుడు