logo

ప్రత్యేక ఎస్సై సస్పెన్షన్‌

చెంగల్పట్టు జిల్లా పౌంజూర్‌ సమీప ఎల్‌ఎల్‌ ఎండత్తూర్‌కు చెందిన శివబాలన్‌ 2018లో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నాడు.

Published : 04 Jun 2023 01:27 IST

భక్తవత్సలం

మహాబలిపురం, న్యూస్‌టుడే:. చెంగల్పట్టు జిల్లా పౌంజూర్‌ సమీప ఎల్‌ఎల్‌ ఎండత్తూర్‌కు చెందిన శివబాలన్‌ 2018లో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నాడు. ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందటంతో చిత్తామూర్‌ పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు విచారణ 2019లో ముగిసింది. తరువాత శివబాలన్‌ తన ద్విచక్ర వాహనాన్ని తీసుకోవడానికి చిత్తామూర్‌ పోలీసు స్టేషనకు వెళ్లాడు. అక్కడ పోలీసులు అతనికి పాత నెంబరు ప్లేటు లేని ద్విచక్ర వాహనాన్ని అప్పగించారు. తన వాహనాన్ని పోలీసులు నెంబరు ప్లేటు మార్చి వాడుకుంటున్నట్లు శివబాలన్‌ గుర్తించాడు. దీంతో స్టేషనుకు వెళ్లి తన వాహనాన్ని ఇవ్వాలని, లేకుంటే ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాడు. దీంతో పోలీసులు అతని వాహనంలోని కొత్త విడి భాగాలను తొలగించి పనికి రాని భాగాలు అమర్చి అప్పగించారు. ఆగ్రహించిన శివబాలన్‌ మళ్లీ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాలతో ప్రత్యేక పోలీసు బృందం దర్యాప్తు జరిపి నివేదికను అందజేసింది. ప్రత్యేక సబ్‌ఇన్‌స్పెక్టరు భక్తవత్సలం శివబాలన్‌ ద్విచక్ర వాహనాన్ని నాలుగు ఏళ్లుగా వాడుకుంటున్నట్లు తెలియడంతో భక్తవత్సలాన్ని సస్పెండు చేస్తూ ఎస్పీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండైన ఎస్‌ఎస్‌ఐ మరో 10 రోజుల్లో పదవీ విరమణ పొందనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని