logo

వేలూరుకు అమిత్‌షా రాక 8న

కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మంత్రి అమిత్‌షా ఈనెల 8న వేలూరు విచ్చేయనున్నారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వ తొమ్మిదేళ్ల పాలన విజయాలను వివరించే విధంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారు.  సభ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం ఆదివారం వేలూరులో భాజపా రాష్ట్ర కార్యదర్శి కాత్యాయని అధ్యక్షతన జరిగింది.

Published : 05 Jun 2023 01:57 IST

ఆవడి, న్యూస్‌టుడే: కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మంత్రి అమిత్‌షా ఈనెల 8న వేలూరు విచ్చేయనున్నారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వ తొమ్మిదేళ్ల పాలన విజయాలను వివరించే విధంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారు.  సభ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం ఆదివారం వేలూరులో భాజపా రాష్ట్ర కార్యదర్శి కాత్యాయని అధ్యక్షతన జరిగింది. కందనేరి ప్రాంతంలో సభను నిర్వహించడానికి నిర్ణయించారు. కార్యక్రమంలో భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరేంద్రన్‌, వేలూరు జిల్లా అధ్యక్షుడు మనోహరన్‌, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని