logo

అభివృద్ధి పనుల పరిశీలన

తమిళనాడు ప్రభుత్వ పారిశ్రామిక పెట్టుబడులు, ప్రోత్సాహం, వాణిజ్యశాఖ తరఫున సిప్‌కాట్‌, టిడ్కో సంస్థల ద్వారా అమలు చేసే పలు పథకాల పనులను ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిశీలించారు.

Updated : 05 Jun 2023 04:57 IST

కార్మికుల కోసం నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవన నమూనా పరిశీలిస్తున్న ఇరైయన్బు

సైదాపేట, న్యూస్‌టుడే: తమిళనాడు ప్రభుత్వ పారిశ్రామిక పెట్టుబడులు, ప్రోత్సాహ, వాణిజ్యశాఖ తరఫున సిప్‌కాట్‌, టిడ్కో సంస్థల ద్వారా అమలు చేసే పలు పథకాల పనులను ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిశీలించారు. మొదటిగా చెన్నై ఆలందూర్‌ నందంబాక్కంలో టిడ్కో సంస్థ ద్వారా చేపట్టిన చెన్నై వాణిజ్య కేంద్ర విస్తరణ పనులను పరిశీలించారు. ఈ పథకంలో 9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఆడిటోరియం, 5 వస్తు ప్రదర్శన హాళ్లు, భహుళ అంతస్తుల పార్కింగ్‌ భవనం తదితర నిర్మాణ పనులను పరిశీలించారు. తర్వాత సిప్‌కాట్‌ సంస్థ ద్వారా కాంచీపురం జిల్లా వల్లం వడకాలిలో రూ.680 కోట్ల వ్యయంతో 18,720 మంది కార్మికులు నివసించే విధంగా పరిశ్రమలకు దగ్గర్లో నిర్మిస్తున్న సమీకృత సిబ్బంది వసతి గృహ నిర్మాణ పనులను, అక్కడ ఏర్పాటు చేస్తున్న తాగునీరు, రోడ్డు, క్రీడా స్టేడియం, మురుగు నీటి శుద్ధీకరణ కేంద్రం, వాననీటి సేకరణ, సౌరశక్తి విద్యుత్‌ తదితర సౌకర్యాలను పరిశీలించారు. అలాగే తిరుపెరుంబుదూరు సిప్‌కాట్‌ పారిశ్రామిక వాడ, తిరువళ్లూరు జిల్లా పట్టాభిరామ్‌లో టిడ్కో ద్వారా రూ.327 కోట్లతో నిర్మిస్తున్న టైడల్‌ పార్కు, అందులో ఏర్పాటుకానున్న సమాచార సాంకేతిక పార్కు, రెండు క్యాంటీన్ల నిర్మాణ పనులను పరిశీలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని