logo

ఆందోళనకారుల అరెస్టు

రాణిపేట జిల్లా లాలాపేట, ముకుందరాయపురం గ్రామాల మధ్య సరిహద్దు సమస్య ఉంది. దీంతో రెండు గ్రామాల మధ్య తరచూ ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి.

Updated : 05 Jun 2023 05:13 IST

అరక్కోణం, న్యూస్‌టుడే: రాణిపేట జిల్లా లాలాపేట, ముకుందరాయపురం గ్రామాల మధ్య సరిహద్దు సమస్య ఉంది. దీంతో రెండు గ్రామాల మధ్య తరచూ ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో శనివారం దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి శతజయంతి సందర్భంగా లాలాపేట గ్రామంలో డీఎంకే జెండా ఏర్పాటు చేసే విషయంలో అగ్రహారం గ్రామానికి చెందిన డీఎంకే యూనియన్‌ కార్యదర్శి మురుగన్‌ వర్గీయులకు, లాలాపేట పంచాయతీ అధ్యక్షుడు గోకులన్‌ వర్గీయులకు ఘర్షణ జరిగింది. ఘర్షణకు దిగిన వారిపై చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ఇరువర్గాల వారు రాస్తారోకోలకు పాల్పడ్డారు. పోలీసులు ఇరువర్గాలతో చర్చలు జరిపారు. గోకుల్‌ వర్గానికి చెందిన 18 మందిని, మురుగన్‌ వర్గానికి చెందిన 17 మందిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.


రెజ్లర్లకు మద్దతు

చెన్నై, న్యూస్‌టుడే: దిల్లీలో పోరాడుతున్న రెజ్లర్లకు మద్దతుగా నగరంలో ఆదివారం ఆందోళన జరిగింది. ఎగ్మూరులోని రాజారత్నం స్టేడియం వద్ద జరిగిన ఆందోళనలో మక్కళ్‌ పాదై, యునైటెడ్‌ ఇండియా సంస్థల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపా ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌పై చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని