logo

దోపిడీదారుల్ని ప్రతిఘటించిన మహిళా కానిస్టేబుల్‌

మెరినా బీచ్‌లో ప్రేమికుల వద్ద దోపిడీకి యత్నించిన నలుగురిని ఓ మహిళా పోలీసు ఒంటరిగా ప్రతిఘటించారు. మెరినా తీరంలో ప్రజాపనులశాఖ కార్యాలయానికి ఎదురుగా ఆదివారం సాయంత్రం రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చిన నలుగురు దుండగులు అక్కడి ఓ ప్రేమజంట వద్ద దోపిడీకి ప్రయత్నించారు.

Published : 05 Jun 2023 05:14 IST

కళ

చెన్నై, న్యూస్‌టుడే: మెరినా బీచ్‌లో ప్రేమికుల వద్ద దోపిడీకి యత్నించిన నలుగురిని ఓ మహిళా పోలీసు ఒంటరిగా ప్రతిఘటించారు. మెరినా తీరంలో ప్రజాపనులశాఖ కార్యాలయానికి ఎదురుగా ఆదివారం సాయంత్రం రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చిన నలుగురు దుండగులు అక్కడి ఓ ప్రేమజంట వద్ద దోపిడీకి ప్రయత్నించారు. ప్రేమజంట నుంచి సెల్‌ఫోన్లు లాక్కోవడాన్ని దూరం నుంచి గమనించిన సాయుద దళం కానిస్టేబుల్‌ కళ హుటిహుటిన అక్కడికి చేరుకున్నారు. దోపిడీదారులను నిలువరించడానికి ప్రయత్నించగా కత్తితో పొడిచి చంపుతామంటూ బెదిరించారు. తనకు సాయంగా ఎవరూ రాకున్నా దోపిడీదారులను నిలువరించే ప్రయత్నం చేస్తూనే సెల్‌ఫోన్‌ ద్వారా అన్నా స్క్వేర్‌ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడి నుంచి దోపిడీదారులు తప్పించుకున్నారు. ద్విచక్రవాహనాల నెంబర్లను కళ గుర్తు పెట్టుకున్నారు. ప్రేమజంట ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా దర్యాప్తు జరిపారు. నిందితులను వాల్‌టాక్స్‌ రోడ్డుకు చెందిన రౌడీషీటర్లు ఉదయకుమార్‌, తమిళరసన్‌, వసంతకుమార్‌, సోమసుందరంగా గుర్తించి అరెస్టు చేశారు. దోపిడీదారులను ఒంటరిగా, ధైర్యంగా ఎదుర్కొన్న కానిస్టేబుల్‌ కళకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని