అందుబాటులోకి 500 ఆరోగ్య కేంద్రాలు
రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన 500 పట్ట ఆరోగ్య కేంద్రాలను ముఖ్యమంత్రి స్టాలిన్ వీసీ ద్వారా మంగళవారం ప్రారంభించారు. వైద్య, ప్రజా సంక్షేమ శాఖ తరఫున మంగళవారం సాయంత్రం తేనాంపేటలో ఉన్న వెల్ఫేర్ సెంటరులో ఈ కార్యక్రమం జరిగింది.
పట్టణ ఆరోగ్య కేంద్రాలను వీసీ ద్వారా ప్రారంభిస్తున్న స్టాలిన్
వేలచ్చేరి, న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన 500 పట్ట ఆరోగ్య కేంద్రాలను ముఖ్యమంత్రి స్టాలిన్ వీసీ ద్వారా మంగళవారం ప్రారంభించారు. వైద్య, ప్రజా సంక్షేమ శాఖ తరఫున మంగళవారం సాయంత్రం తేనాంపేటలో ఉన్న వెల్ఫేర్ సెంటరులో ఈ కార్యక్రమం జరిగింది. మొదటి దశలో రూ. 25 లక్షల చొప్పున కేటాయించి రూ. 125 కోట్ల వ్యయంతో వీటిని నిర్మించారు. 500 మంది వంతున వైద్యులు, నర్సులు, హెల్త్ ఇన్‌స్పెక్టర్లు, శుభ్రతా కార్మికులను నియమించారు. ఉదయం 8 - మధ్యాహ్నం 12, సాయంత్రం 4 - రాత్రి 8 గంటల వరకు ఇవి పని చేస్తాయి. ఒక్కో సెంటరు పరిధిలో సుమారు 25 వేల మందికి ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రసూతి, శిశు వైద్య సేవలు, కుటుంబ నియంత్రణ, ఈఎన్‌టీ, దంత తదితర వైద్య చికిత్సలు అందిస్తారు. కార్యక్రమంలో మంత్రులు మా.సుబ్రమణియన్, ఉదయనిధి స్టాలిన్, చెన్నై మేయర్ ఆర్.ప్రియ, కమిషనరు జె.రాధాకృష్ణన్, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గగన్ దీప్ సింగ్ బేడీ, ఎంపీలు దయానిధి మారన్, కళానిధి వీరాస్వామి, తమిళచ్చి తంగ పాండియన్ తదితరులు పాల్గొన్నారు.
జగదీష్ భగన్ రాష్ట్రానికి గర్వకారణం
ఇండియా సిమెంట్స్ ఎండీ ఎన్ శ్రీనివాసన్ తదితరులు...
వేలచ్చేరి, న్యూస్‌టుడే: యెనెస్కో అవార్డుకు ఎంపికైన జగదీష్ భగన్‌ను ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రశంసిస్తూ మంగళవారం ట్వీట్ చేశారు. రామనాథపురం జిల్లా అటవీ శాఖ అధికారి, గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వుడు డైరెక్టరు జగదీష్ భగన్ యునెస్కో బయోస్పియర్ రిజర్వ్ మేనేజ్ మెంటు అవార్డుకు ఎంపిక కావడం అభినందనీయమన్నారు. అటవీ శాఖ, రాష్ట్ర ప్రభుత్వానికి ఇది గర్వకారణంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెరైన్ ఎలైట్ ఫోర్స్ వల్లనే సాధ్యమైందని ఆయన చెప్పడంతో గర్వ పడ్డాననన్నారు.
*ప్రభుత్వ అడిషనల్ ప్రధాన న్యాయవాది జె.రవీంద్రన్ మంగళవారం సీఎంను కలిశారు. చెన్నై అన్నా ఫైఓవర్ వద్ద ఆక్రమణల్లో ఉన్న ఉద్యానవన శాఖకు సొంతమైన రూ. 1000 కోట్ల విలువైన 115 ఎకరాల భూమిపై న్యాయపోరాటం జరిపి స్వాధీనం చేసుకొన్న సందర్భంగా చెన్నై సచివాలయంలో స్టాలిన్‌ను కలిసి ఆశీస్సులు పొందారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వి.ఇరైయన్బు, రెవెన్యూ, ప్రకృతి వైపరీత్యాల మేనేజ్‌మెంటు అడిషనల్ ప్రధాన కార్యదర్శి కుమార్ ఐసక్, ల్యాండ్ నిర్వాహక కమిషనరు నాగరాజన్ పాల్గొన్నారు.
*ఐపీఎల్ పోటీల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గెలిచిన కప్పును మంగళవారం ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఇండియా సిమెంట్స్ ఎండీ, వైస్ ఛైర్మన్ ఎన్ శ్రీనివాసన్, ప్రతినిధి రూపా గురునాథ్ చూపారు. మంత్రి ఉదయనిధి స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.
సీఎంతో న్యాయవాది జె.రవీంద్రన్ తదితరులు
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.