logo

రాష్ట్ర ప్రభుత్వ వైద్యకళాశాలకు గుర్తింపు

రాష్ట్రంలో ఉద్యానవనాల ఏర్పాటు, పాత పార్క్‌లను పునరుద్ధరించడం వంటి పనులు వేగవంతం చేస్తున్నారు.

Published : 07 Jun 2023 00:59 IST

శంకుస్థాపన చేస్తున్న మంత్రి మా.సుబ్రమణియన్‌

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఉద్యానవనాల ఏర్పాటు, పాత పార్క్‌లను పునరుద్ధరించడం వంటి పనులు వేగవంతం చేస్తున్నారు. అందులో భాగంగా రూ.28లక్షల ఖర్చుతో అడయారు మండలం అన్నాసాలైలో చెన్నై 2.0 పథకం కింద కొత్త పార్క్‌ ఏర్పాటుకు మంగళవారం ఆరోగ్యశాఖ మంత్రి మా.సుబ్రమణియన్‌ శంకుస్థ్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.... అఖిల భారత స్థాయిలో 650 వైద్యకళాశాలలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర, కేంద్రప్రభుత్వాలు నిర్వహిచే వైద్యకళాశాలల సమాచారం ప్రకారం ప్రత్యేకమైన కళాశాలల జాబితాను తయారుచేస్తున్నట్లు తెలిపారు.  అందుకు ధరఖాస్తు చేసుకున్న 176 కళాశాలల్లో 11వ స్థానంలో చెన్నై రాజీవ్‌గాంధీ వైద్యకళాశాల ఉందన్నారు. దానికి ముందు 10 స్థానాల్లో 10 కళాశాలలు ప్రైవేట్‌, కేంద్ర ప్రభుత్వ, సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ కళాశాలలే ఉన్నాయన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని