Train Signal: ప్రియురాలి కోసం రైల్వే సిగ్నల్ ధ్వంసం
ప్రియురాలు మాట్లాడలేదన్న కోపంతో ఓ వ్యక్తి రైల్వే సిగ్నల్‌ను ధ్వంసం చేసిన సంఘటన తిరుప్పత్తూర్ రైల్వే స్టేషన్‌లో కలకలం సృష్టించింది.
ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
వేలూర్, న్యూస్‌టుడే: ప్రియురాలు మాట్లాడలేదన్న కోపంతో ఓ వ్యక్తి రైల్వే సిగ్నల్‌ను ధ్వంసం చేసిన సంఘటన తిరుప్పత్తూర్ రైల్వే స్టేషన్‌లో కలకలం సృష్టించింది. మంగళవారం ఉదయం తిరుప్పత్తూర్ స్టేషన్‌లో ప్రయాణికులు భారీగా రైళ్ల కోసం వేచి ఉన్నారు. ఈ సమయంలో ఓ వ్యక్తి స్టేషన్‌కు పక్కనే ఉన్న రైలు సిగ్నల్ స్తంభం వద్దకెళ్లాడు. దీపాలపై రాళ్లతో దాడి చేశాడు. పరిసరాల్లోని పోలీసులు శబ్దం విని అక్కడికి చేరుకున్నారు. మద్యం మత్తులో ఉన్న అతడిని అదుపులోకి తీసుకున్నారు. తిరుప్పత్తూరు బ్రాన్‌లైన్‌కు చెందిన గోకుల్(30)గా గుర్తించారు. ఓ యువతిని ప్రేమించాడని, ఆమె మాట్లాడలేదన్న కోపంతో సిగ్నల్‌పై దాడికి పాల్పడినట్లు అంగీకరించాడు. ఒడిశా రైలు ప్రమాదం దేశాన్ని కుదిపేసిన తరుణంలో ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Mla Rajaiah: కాలం నిర్ణయిస్తే బరిలో ఉంటా: ఎమ్మెల్యే రాజయ్య
-
Khammam: ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. కళాశాల వద్ద ఉద్రిక్తత
-
IND vs AUS: ఆసీస్‌పై ఆల్‌రౌండ్ షో.. టీమ్ఇండియా ఘన విజయం
-
Bennu: నాసా ఘనత.. భూమి మీదికి గ్రహశకలం నమూనాలు!
-
Canada MP: ‘కెనడా హిందువుల్లో భయం’.. ట్రూడోపై సొంతపార్టీ ఎంపీ ఆర్య విమర్శలు..!
-
‘NEET PG అర్హత మార్కులు.. వారికోసమే తగ్గించారా?’: కాంగ్రెస్