చోరీ నగదుతో ఇంటి నిర్మాణం.. రౌడీషీటర్ అరెస్టు
తిరుప్పూర్ జిల్లా కాంగేయం సమీపం కొడువాయ్ ప్రాంతంలోని ఊరి చివర ఒకరు విలాసవంతమైన బంగ్లాను నిర్మిస్తున్నారు.
వేలచ్చేరి, న్యూస్‌టుడే: తిరుప్పూర్ జిల్లా కాంగేయం సమీపం కొడువాయ్ ప్రాంతంలోని ఊరి చివర ఒకరు విలాసవంతమైన బంగ్లాను నిర్మిస్తున్నారు. అనుమానించిన స్థానికులు ఊదియూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిర్మాణంలో ఉన్న గృహాన్ని పరిశీలించారు. దర్యాప్తులో ఆ విలాసవంతమైన భవనం యజమాని చెన్నై వ్యాసర్‌పాడి కరిమేడు ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ జనా అలియాస్ జనార్దనన్(40) అని తెలిసింది. అతనిపై పోలీసు స్టేషన్లలో 15కు పైగా హత్యాయత్నం, పలు దోపిడీ కేసులు ఉన్నట్లు వెల్లడైంది. సుమారు 3 ఏళ్ల క్రితం పూచీకత్తుపై విడుదలై అదృశ్యమైనట్లు తెలిసింది. అతడు చోరీ చేసిన రూ. కోటి నగదుతో ఈ భవనం నిర్మిస్తున్నట్లు తెలియడంతో అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.