logo

ఆక్రమిత భూమి స్వాధీనం

చెన్నైలో అన్నాడీఎంకే నేత ఆధీనంలో ఉన్న రూ. వెయ్యి కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొన్నామని రాష్ట్ర రెవెన్యూ, విపత్తుల నివారణ శాఖ మంత్రి సాత్తూర్‌ రామచంద్రన్‌ పేర్కొన్నారు.

Published : 07 Jun 2023 00:59 IST

విలేకర్లతో మాట్లాడుతున్న మంత్రి సాత్తూర్‌ రామచంద్రన్‌

వేలచ్చేరి,న్యూస్‌టుడే: చెన్నైలో అన్నాడీఎంకే నేత ఆధీనంలో ఉన్న రూ. వెయ్యి కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొన్నామని రాష్ట్ర రెవెన్యూ, విపత్తుల నివారణ శాఖ మంత్రి సాత్తూర్‌ రామచంద్రన్‌ పేర్కొన్నారు. మంగళవారం విరుదునగర్‌ జిల్లా కలెక్టరు కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. చెన్నై అన్నా పై వంతెన సమీపంలో క్యాథడ్రల్‌ రోడ్డులో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యానవన శాఖకు సొంతమైన భూమి ఉండేదన్నారు. దీనిని ఓ నేత ఆక్రమించుకోవడంతో న్యాయస్థానంలో పోరాటం ద్వారా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నెల క్రితం వేలచ్చేరిలో ప్రైవేటు ఆక్రమణలో ఉన్న 63 గ్రౌండ్ల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొన్నామని, ఇకపై ఇలాంటి చర్యలు కొనసాగిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనపై గవర్నరు చేసిన వ్యాఖ్యల గురించి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ... గవర్నరుపై ప్రత్యేక గౌరవం ఉందని, దానిని కాపాడుకుంటే మంచిదన్నారు.  

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని