logo

సముద్ర సాహస యాత్ర ప్రారంభం

కారైక్కాల్‌కు చెందిన విద్యార్థులు బుధవారం సెయిలింగ్‌ బోట్లో పుదుచ్చేరికి సముద్ర సాహస యాత్రను చేపట్టారు. వచ్చే ఏడాది (2024)లో న్యూ ఢిల్లీలో జరిగే గణతంత్ర పరేడ్‌లో పాల్గొనే వారిని ఎంపిక చేయడానికి నేషనల్‌ స్టూడెంట్స్‌ కార్ప్స్‌ ద్వారా పోటీలను నిర్వహిస్తున్నారు.

Published : 08 Jun 2023 00:10 IST

యాత్రను ప్రారంభిస్తున్న మంత్రి చంద్ర ప్రియాంక

వేలచ్చేరి, న్యూస్‌టుడే: కారైక్కాల్‌కు చెందిన విద్యార్థులు బుధవారం సెయిలింగ్‌ బోట్లో పుదుచ్చేరికి సముద్ర సాహస యాత్రను చేపట్టారు. వచ్చే ఏడాది (2024)లో న్యూ ఢిల్లీలో జరిగే గణతంత్ర పరేడ్‌లో పాల్గొనే వారిని ఎంపిక చేయడానికి నేషనల్‌ స్టూడెంట్స్‌ కార్ప్స్‌ ద్వారా పోటీలను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం తమిళనాడు స్టూడెంట్స్‌ కార్ప్స్‌ యూనిట్, పుదుచ్చేరి నేషనల్‌ స్టూడెంట్స్‌ కార్ప్స్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో ఈనెల 2వ తేదీన పాఠశాల విద్యార్థుల కోసం సెయిలింగ్‌ బోట్ యాత్రను పుదుచ్చేరిలో ముఖ్యమంత్రి రంగస్వామి ప్రారంభించారు. ఇందులో 25 మంది విద్యార్థినులతో సహా 60 మంది మంగళవారం సాయంత్రం కారైక్కాల్‌కు చేరుకొన్నారు. ఈ యాత్రలో లెఫ్టినెంట్ కమాండర్లు కె కీర్తి నిరంజన్‌, ఎస్‌ లోకేష్‌ ఇతర వైద్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బుధవారం ఉదయం సెయిలింగ్‌ బోట్ సాహస యాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పుదుచ్చేరి, రవాణాశాఖ మంత్రి చంద్ర ప్రియాంక, కారైక్కాల్‌ కలెక్టరు కులోత్తుంగన్‌ జెండా ఊపి సముద్ర సాహస యాత్రను ప్రారంభించారు. యాత్రలో పాల్గొన్న వారిని మంత్రి శాలువలు కప్పి సత్కరించారు. కారైక్కాల్‌-పుదుచ్చేరి, మధ్య గల 302 కి.మీ. సముద్ర సాహస యాత్రలో పాల్గొనే వారు కొన్ని ప్రాంతాల్లో ఆగి రక్తదానం, బీచ్‌ పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని