logo

వినియోగంలోకి శ్రీలంక శరణార్థుల గృహాలు

వేలూర్‌ సమీపం మేల్‌మొనవూరులో శ్రీలంక శరణార్థులకు రూ.11 కోట్ల వ్యయంతో 220 గృహాలు నిర్మించారు. వీటి ప్రారంభోత్సవం ఆదివారం జరిగింది.

Published : 18 Sep 2023 00:07 IST

లబ్ధిదారులకు తాళం చెవి అందిస్తున్న సీఎం స్టాలిన్‌

రెడ్‌హిల్స్‌, న్యూస్‌టుడే: వేలూర్‌ సమీపం మేల్‌మొనవూరులో శ్రీలంక శరణార్థులకు రూ.11 కోట్ల వ్యయంతో 220 గృహాలు నిర్మించారు. వీటి ప్రారంభోత్సవం ఆదివారం జరిగింది. కలెక్టరు కుమరవేల్‌పాండ్యన్‌ అధ్యక్షత వహించిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ముఖ్య అతిథిగా పాల్గొని గృహాలను వినియోగంలోకి తీసుకొచ్చారు. అలాగే 13 జిల్లాల్లో రూ.79.70 కోట్లతో నిర్మించిన గృహాలను వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు తాళాలు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దురైమురుగన్‌, సెంజి మస్తాన్‌, అన్బిల్‌ మహేశ్‌, ఎంపీలు జగద్రక్షగన్‌, కదిర్‌ఆనంద్‌, కళానిధి వీరాస్వామి, ఎమ్మెల్యేలు నందకుమార్‌, కార్తికేయన్‌, అములు, మేయర్‌ సుజాత, డిప్యూటీ మేయర్‌ సునీల్‌కుమార్‌, ఐజీ కన్నన్‌, డీఐజీ ముత్తుస్వామి తదితరులు పాల్గొన్నారు. ముందుగా ముఖ్యమంత్రి స్టాలిన్‌ అన్నాసాలైలోని పెరియార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  

ఒడిశా సీఎంకు సానుభూతి

చెన్నై, న్యూస్‌టుడే: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌కు సోదరి వియోగం కలిగిన నేపథ్యంలో ఆయనకు సీఎం స్టాలిన్‌ సానుభూతి తెలిపారు. ఆయన తన సంతాప ప్రకటనలో... నవీన్‌ పట్నాయక్‌ సోదరియైన ప్రముఖ రచయిత్రి, డాక్యుమెంటరీ దర్శకురాలు గీతా మెహతా మరణవార్త తనను కలచి వేసిందన్నారు. సాహిత్యానికి, డాక్యుమెంటరీకి ఆమె బృహత్తర సేవలు అందించారని కొనియాడారు. ఆమెను కోల్పోయి బాధపడుతున్న నవీన్‌ పట్నాయక్‌, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు