logo

విశ్వకర్మ పథకంతో తమిళనాడుకు ప్రయోజనం

విశ్వకర్మ పథకంతో తమిళనాడుకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర సహాయ మంత్రి ఎస్పీ సింగ్‌ బాగెల్‌ తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వశాఖ తరఫున విశ్వకర్మ పథకాన్ని ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ దిల్లీలో ప్రారంభించారు.

Published : 18 Sep 2023 00:07 IST

కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్‌ బాగెల్‌

మాట్లాడుతున్న కేంద్ర మంత్రి పంకజ్‌ చౌదరి

సైదాపేట, న్యూస్‌టుడే: విశ్వకర్మ పథకంతో తమిళనాడుకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర సహాయ మంత్రి ఎస్పీ సింగ్‌ బాగెల్‌ తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వశాఖ తరఫున విశ్వకర్మ పథకాన్ని ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ దిల్లీలో ప్రారంభించారు. రాష్ట్రంలో దీనికి సంబంధించిన కార్యక్రమం మదురైలోని వ్యవసాయ వాణిజ్య కేంద్రంలో జరిగింది. కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్‌ బాగెల్‌ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే గాంధీ, ఎంఎస్‌ఎంఈ ఛైర్మన్‌ ముత్తురామన్‌, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కరు నాగరాజన్‌, మదురై నగర అధ్యక్షుడు మహా సుశీంద్రన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ... సాంస్కృతిక కళాకారుల నైపుణ్యాలను కాపాడేందుకే ఈ పథకం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. కళాకారులు, సంబంధిత కార్మికులు ఉచితంగా దరఖాస్తు చేసుకుని గుర్తింపు కార్డు పొందవచ్చన్నారు. ఆంగ్లేయుల కాలం నుంచే సనాతనంపై దాడి జరుగుతోందన్నారు. అయినప్పటికీ సనాతనం స్థిరంగా ఉన్నట్లు తెలిపారు. ‘ఇండియా’ కూటమికి నాయకుడు లేడని ఎద్దేవా చేశారు.

కోయంబత్తూరులో..

కోయంబత్తూరు, న్యూస్‌టుడే: కోయంబత్తూరులోని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన విశ్వకర్మ పథకం ప్రారంభ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి అధ్యక్షత వహించి మాట్లాడారు. ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్‌, సబ్‌ కలెక్టరు సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని