logo

వందే భారత్‌ లోకో పైలట్లు సిద్ధం

వందే భారత్‌ రైళ్లను నడిపేందుకు మంచి శిక్షణ పొందిన సిబ్బంది ఉన్నారని దక్షిణ రైల్వే గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. దక్షిణ రైల్వేలో రొటేషన్‌ పద్ధతిలో 248 మంది శిక్షణ పొందిన సిబ్బంది పని చేస్తున్నారు.

Updated : 22 Sep 2023 06:34 IST

శిక్షణ పూర్తి చేసుకున్న 248 మంది

రైలు ముందు గార్డు

వందే భారత్‌ రైళ్లను నడిపేందుకు మంచి శిక్షణ పొందిన సిబ్బంది ఉన్నారని దక్షిణ రైల్వే గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. దక్షిణ రైల్వేలో రొటేషన్‌ పద్ధతిలో 248 మంది శిక్షణ పొందిన సిబ్బంది పని చేస్తున్నారు.

న్యూస్‌టుడే, వడపళని  దేశవ్యాప్తంగా వందేభారత్‌ రైళ్లు ప్రత్యేక గుర్తింపు కలిగి ఉన్నాయి. డాక్టర్‌ ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ - మైసూరు - డాక్టర్‌ ఎంజీఆర్‌ చెన్నై స్రెంటల్‌, చెన్నై సెంట్రల్‌ - కోయంబత్తూరు - చెన్నై,  తిరువనంతపురం సెంట్రల్‌ - కాసర్‌గోడ్‌ - తిరువనంతపురం సెంట్రల్‌ ప్రాంతాలకు ఈ రైళ్లు నడుస్తున్నాయి. ఈ మూడు మార్గాలకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. 160 కిలోమీటర్ల వేగంతో నడిచేందుకు,  చెన్నై - అరక్కోణం సెక్షన్లలో 130 కిలోమీటర్ల వేగంతో నడిపేందుకు లోకో పైలట్లకు ప్రత్యేక శిక్షణ అందించారు. లోకో పైలట్లు చెన్నై ఐసీఎఫ్‌లో, ఘజియాబాద్‌ ఎలక్ట్రికల్‌ ట్రెయినింగ్‌ సెంటర్‌, ఆవడి జోనల్‌ ఎలక్ట్రిక్‌ ట్రాక్షన్‌ ట్రెయినింగ్‌ సెంటర్‌లో ప్రత్యేకంగా శిక్షణ పొందారు.

క్యాబిన్‌లో వసతులు

  • దక్షిణ రైల్వేలో ప్రస్తుతం 248 మంది లోకో పైలట్లు, అసిస్టెంట్ లోకో పైలట్లు వందే భారత్‌ రైళ్లలో రొటేషన్‌ పద్ధతిలో పని చేస్తున్నారు.
  • అన్ని రకాలుగా భద్రతతో నడిపేందుకు కావలసిన వసతులు లోకో పైలట్ క్యాబిన్‌లో ఉన్నాయి.
  • పైలట్లకు బాగా కనిపించేందుకు వీలుగా ముందుగా అద్దాలతో కూడిన పెద్ద స్క్రీన్‌.
  • లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్లకు అధునాతన వసతులతో కూడిన కుర్చీలు.
  • సిగ్నళ్లు మార్చుకునేందుకు కావలసిన సిగ్నల్‌ ఎక్ఛేంజ్‌ లార్పస్‌.
  • లూప్‌లైన్ల వేగాన్ని నియంత్రిస్తూ తేలికగా నడిపేందుకు వీలుగా క్రూయిజ్‌ కంట్రోల్‌, హెచ్చరిక ప్రాంతాలు గుర్తిస్తూ, గరిష్ఠ వేగంతో నడిపేందుకు వీలుగా ఏర్పాట్లు.
  • క్యాబిన్‌ లోపల తిరిగేందుకు అనువైన స్థలం. ఏసీ సదుపాయం.
  • ఓహెచ్‌ఈ కండిషన్‌ తెలుసుకునేందుకు వీలుగా వీడియో డిస్‌ప్లే.
  • గార్డు, లోకో పైలట్కు మధ్య సమాచారం అందుకోవడానికి కావలసిన వ్యవస్థ వంటి సదుపాయాలు కల్పించారు.

లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని