logo

క్షమాపణ చెప్పబోను: అన్నామలై

దివంగత ముఖ్యమంత్రి అన్నాదురైపై తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పబోనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై స్పష్టం చేశారు.

Published : 22 Sep 2023 00:06 IST

మాట్లాడుతున్న అన్నామలై

కోయంబత్తూరు, న్యూస్‌టుడే: దివంగత ముఖ్యమంత్రి అన్నాదురైపై తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పబోనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై స్పష్టం చేశారు. అన్నాదురై స్వాతంత్య్ర సమరయోధుడు పసుంపొన్‌ మత్తురామలింగదేవర్‌ను ఓ వ్యవహారానికి సంబంధించి క్షమాపణ కోరారని అన్నామలై ఇటీవల ఓ సమవేశంలో ప్రస్తావించారు. ఇది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెనుదుమారం రేపింది. భాజపాతో అన్నాడీఎంకే కూటమి లేదని అన్నాడీఎంకే మాజీ మంత్రి జయకుమార్‌ రెండు రోజుల క్రితం ప్రకటించారు. ఈ నేపథ్యంలో అన్నామలై కోయంబత్తూరులో గురువారం విలేకరులతో మాట్లాడారు. తాను క్షమాపణ చెప్పాలని అన్నాడీఎంకే నేతలు చేస్తున్న డిమాండులో అర్థం లేదన్నారు. తనకు అన్నాడీఎంకే నేతలతో తగవు లేదని, వారు తనపై బురద చల్లితే సహించబోనని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని