logo

భాషాభిమానులకు ఇదో గొప్ప విజయం

రాష్ట్రంలో మాతృభాషను నేర్చుకోవడం, రాజ్యాంగ హక్కును వినియోగించుకోవడంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ ఇచ్చిన తీర్పుపై ‘లింగ్విస్టిక్‌ మైనారిటీస్‌ ఫోరం ఆఫ్‌ టీఎన్‌’ (ఎల్‌ఐఎంఎఫ్‌వోటీ) గురువారం హర్షం వ్యక్తం చేసింది.

Published : 22 Sep 2023 00:06 IST

ఎల్‌ఐఎంఎఫ్‌టీవో

న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌

వడపళని, న్యూస్‌టుడే: రాష్ట్రంలో మాతృభాషను నేర్చుకోవడం, రాజ్యాంగ హక్కును వినియోగించుకోవడంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ ఇచ్చిన తీర్పుపై ‘లింగ్విస్టిక్‌ మైనారిటీస్‌ ఫోరం ఆఫ్‌ టీఎన్‌’ (ఎల్‌ఐఎంఎఫ్‌వోటీ) గురువారం హర్షం వ్యక్తం చేసింది. తమిళనాడులోని పాఠశాలల్లో తమిళం కాకుండా మరే భాషయినా నేర్చుకోవాలనుకునే వారికి అవకాశం కల్పించాలని, ఉత్తీర్ణత సాధించేందుకు కనీస మార్కులైనా ఉండాలని, ఆ మార్కులు ‘మార్కుల షీటు’లో కూడా ఉండేట్టుగా చూడాలని ఆయన తీర్పునిచ్చారు. 2016లో మద్రాస్‌ హైకోర్టులో ఆయన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు మాతృభాష నేర్చుకునేందుకు ఇచ్చిన తీర్పుతో ఉపశమనం కలిగిందని, ఇప్పుడు ఇచ్చిన తీర్పుతో శాశ్వత పరిష్కారం లభించిందని ఎల్‌ఐఎంఎఫ్‌వోటీ, ఏఐటీఎఫ్‌ ఛైర్మన్‌, డాక్టర్‌ సీఎంకే రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని