logo

పిల్లలతో తల్లిదండ్రులు అధిక సమయం గడపాలి

పిల్లల్లో మానసిక ఒత్తిడి తగ్గించేందుకు తల్లిదండ్రులు వారితో అధిక సమయం గడపాలని పుదుచ్చేరి ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్‌ గవర్నరు తమిళిసౌ సౌందరరాజన్‌ తెలిపారు.

Published : 22 Sep 2023 00:06 IST

తమిళిసై

విద్యార్థులు తయారుచేసిన కళా ఖండాలను తిలకిస్తున్న ఇన్‌ఛార్జి ఎల్జీ

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: పిల్లల్లో మానసిక ఒత్తిడి తగ్గించేందుకు తల్లిదండ్రులు వారితో అధిక సమయం గడపాలని పుదుచ్చేరి ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్‌ గవర్నరు తమిళిసౌ సౌందరరాజన్‌ తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికితీయడానికిగాను నిర్వహించిన ‘నైపుణ్యం తెలుసుకుందాం’ కార్యక్రమం పుదుచ్చేరి రాజ్‌నివాస్‌లో గురువారం జరిగింది. దీనికి తమిళిసై నేతృత్వం వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 10 మంది పాల్గొని భరతనాట్యం, కర్రసాము, సంగీత వాద్యాలు వాయించడం, పనికిరాని వస్తువుల నుంచి కళా ఖండాలు తయారుచేయడం వంటి పలు ప్రతిభలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా తమిళిసౌ మాట్లాడుతూ... పిల్లల్లో మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు తల్లిదండ్రులు వారికి అధిక సమయం కేటాయించాలని తెలిపారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభలను గుర్తించి వారిని అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేలా శిక్షణ ఇప్పించాలన్నారు. ఇందుకు గవర్నర్‌ మాలిగై విద్యార్థులకు సాయపడుతుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని