logo

మెట్రో విస్తరణ పనులకు సమగ్ర నివేదిక

మెట్రో రెండో దశలో కోయంబేడు నుంచి ఆవడి వరకు (వయా తిరుమంగళం, ముగప్పేర్‌) అయిదో మార్గం ఎక్స్‌టెన్షన్‌ పనులకు, సిరుసేరి నుంచి కీలంబాక్కం బస్‌ టెర్మినస్‌ వరకు (వయా కీలంబాక్కం) మూడో మార్గం

Published : 22 Sep 2023 00:06 IST

రమేష్‌చంద్‌ మీనాకు నివేదిక అందిస్తున్న ఎంఏ సిద్ధిక్‌

వడపళని, న్యూస్‌టుడే: మెట్రో రెండో దశలో కోయంబేడు నుంచి ఆవడి వరకు (వయా తిరుమంగళం, ముగప్పేర్‌) అయిదో మార్గం ఎక్స్‌టెన్షన్‌ పనులకు, సిరుసేరి నుంచి కీలంబాక్కం బస్‌ టెర్మినస్‌ వరకు (వయా కీలంబాక్కం) మూడో మార్గం ఎక్స్‌టెన్షన్‌ పనులకు సంబంధించిన సమగ్ర నివేదికను అదనపు ప్రధాన కార్యదర్శి  రమేష్‌ చంద్‌ మీనాకు సీఎంఆర్‌ఎల్‌ ఎండీ ఎంఏ సిద్ధిక్‌ సచివాలయంలో బుధవారం అందజేశారు. 16.07 కి.మీ దూరంలో అయిదో మార్గంలో 15 స్టేషన్లు రానున్నాయి. వ్యయ అంచనా రూ.6376.18 కోట్లుగా ఉంది. అదేవిధంగా సిరుసేరి నుంచి కీలంబాక్కం వరకు జరగనున్న విస్తరణ పనులు 23.5 కి.మీ దూరం ఉండనున్నాయి. 12 స్టేషన్ల నిర్మాణానికి రూ.5458.06 కోట్ల వ్యయం కాగలదని సిద్ధిక్‌ తెలిపారు. కార్యక్రమంలో సీఎంఆర్‌ఎల్‌ ప్రాజెక్ట్స్‌ డైరెక్టరు టి.అర్జునన్‌, సీజీఎం రేఖా ప్రకాశ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని