logo

కావేరి ఒడ్డు నుంచే భారతదేశ చరిత్ర

భారతదేశ చరిత్ర కావేరి ఒడ్డు నుంచే రాయాలని పురావస్తుశాఖ మంత్రి తంగం తెన్నరసు తెలిపారు. తంజావూర్‌ తమిళ విశ్వవిద్యాలయంలో గురువారం జరిగిన ‘అధ్యాయాల ద్వారా వెల్లడైన తమిళనాడు చరిత్ర’ అనే అంశంపై జరిగిన సదస్సుని మంత్రి ప్రారంభించారు.

Published : 22 Sep 2023 00:06 IST

మంత్రి తంగం తెన్నరసు

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: భారతదేశ చరిత్ర కావేరి ఒడ్డు నుంచే రాయాలని పురావస్తుశాఖ మంత్రి తంగం తెన్నరసు తెలిపారు. తంజావూర్‌ తమిళ విశ్వవిద్యాలయంలో గురువారం జరిగిన ‘అధ్యాయాల ద్వారా వెల్లడైన తమిళనాడు చరిత్ర’ అనే అంశంపై జరిగిన సదస్సుని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగని పురావస్తు పరిశోధనలు రాష్ట్రంలో మాత్రమే అధికంగా జరుగుతున్నాయని తెలిపారు. ఇందుకోసం సీఎం స్టాలిన్‌ నిధుల సాయం అందిస్తున్నారని పేర్కొన్నారు. కీళడి, బోరునై, వెంబకోట్టై, వైపారు తదితర ప్రాంతాల్లో జరిపిన పరిశోధనలతో తమిళనాడు చరిత్ర ఔన్నత్యాన్ని తెలుసుకోవచ్చని తెలిపారు. గంగైకొండ చోళపురంలో మ్యూజియం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని