logo

ఫైనాన్స్‌ కంపెనీ రూ.300 కోట్ల మోసం

తంజావూర్‌ జిల్లా కుంభకోణంలో అర్జున్‌కార్తిక్‌ అనే వ్యక్తి ‘శ్రీసాయి క్రిప్టో కన్సల్టెన్సీ’ పేరిట ఓ కంపెనీని 2021 నుంచి నడుపుతున్నాడు.

Published : 22 Sep 2023 00:06 IST

పోలీసులకు బాధితుల ఫిర్యాదు

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: తంజావూర్‌ జిల్లా కుంభకోణంలో అర్జున్‌కార్తిక్‌ అనే వ్యక్తి ‘శ్రీసాయి క్రిప్టో కన్సల్టెన్సీ’ పేరిట ఓ కంపెనీని 2021 నుంచి నడుపుతున్నాడు. దీని శాఖలు తంజావూర్‌, తిరువారూర్‌, నాగపట్నం, కడలూర్‌లలో ఉన్నాయి. ఇందులో రూ.లక్ష పెట్టుబడి పెడితే 18 నెలల్లో రూ.15 వేలు వడ్డి ఇస్తామని, దీంతోపాటు బంగారు నాణెం అందిస్తామని ప్రకటించారు. దీంతో ప్రజలు పెట్టుబడి పెట్టారు. తర్వాత వడ్డీ ఇవ్వకపోవడంతో పెట్టుబడిదారులు పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో అన్ని శాఖల మీద మొత్తం రూ.300 కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు ఆరోపిస్తూ బాధితులు కొందరు గురువారం తిరుచ్చి ఐజీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని