logo

నా చావుతోనైనా నాది నిజమైన ప్రేమని తెలుసుకుంటావు..

‘నిన్ను ప్రాణంగా ప్రేమించాను. నా ప్రేమను నువ్వు నమ్మేలా లేవు. నా చావుతోనైనా నాది నిజమైన ప్రేమని తెలుసుకుంటావు.. ఉంటా’ అంటూ ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని, ఉరేసుకుని

Published : 19 Jul 2021 07:23 IST

సుధాకర్‌

అమీర్‌పేట, న్యూస్‌టుడే: ‘నిన్ను ప్రాణంగా ప్రేమించాను. నా ప్రేమను నువ్వు నమ్మేలా లేవు. నా చావుతోనైనా నాది నిజమైన ప్రేమని తెలుసుకుంటావు.. ఉంటా’ అంటూ ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని, ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సార్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదులు వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా, మొగల్తూరు మండలం, కె.పి.పాలెంకు చెందిన జి.సుధాకర్‌(30) బీకేగూడలో మిత్రుడితో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అమీర్‌పేటలో సాఫ్ట్‌వేర్‌ కోర్సులో శిక్షణ తీసుకుంటూ, ఆన్‌లైన్‌ వ్యాపారం చేస్తున్నాడు. ఏడాది క్రితం ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం అయిన ఓ యువతిని ప్రేమించాడు. ఆమె నిరాకరించడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. శనివారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి శవాగారానికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని