Tirumala: తిరుమలలో భారీగా రద్దీ.. భక్తులు ఓపికతో ఉండాలి: వైవీ సుబ్బారెడ్డి

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని అన్ని క్యూలైన్లు నిండిపోయాయి.

Updated : 29 May 2022 15:39 IST

తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని అన్ని క్యూలైన్లు నిండిపోయాయి. ప్రస్తుతం క్యూలైన్లలో భక్తులు తితిదే ఆస్థాన మండపం వరకు వేచియున్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 24 గంటలకు పైనే సమయం పడుతోంది. 

భక్తుల రద్దీ నేపథ్యంలో తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. వేసవి సెలవులు కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉందని.. శ్రీవారి దర్శనం అయ్యే వరకు ఓపికగా వేచి ఉండేలా ఏర్పాట్లు చేసుకుని రావాలని ఆయన సూచించారు. కరోనా పరిస్థితులతో సుమారు రెండేళ్లుగా చాలా మంది భక్తులు తిరుమల రాలేకపోయారన్నారు. అందుకే ఇప్పుడు రద్దీ ఎక్కువగా ఉందనిన.. భక్తులకు అవసరమైన ఆహారం, నీరు అందించేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. తితిదే అధికారులు, ఉద్యోగులు బ్రహ్మాండంగా పనిచేస్తూ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి

తిరుమల శ్రీవారిని కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్‌ పురి దర్శించుకున్నారు. దర్శనం అనంతరం అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం పలికారు. అనంతరం కేంద్రమంత్రికి తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడుతూ 1987 నుంచి తాను తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నట్లు చెప్పారు. స్వామి దర్శనంతో కొత్త ఉత్సాహం, స్ఫూర్తి లభించాయన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని