logo
Updated : 13/09/2021 04:49 IST

కూలితే... అంతే...!

పెదగంట్యాడలో శిథిలమైన గృహ సముదాయం
న్యూస్‌టుడే, గాజువాక (పెదగంట్యాడ)

భవన గోడలపై మొక్కలు పెరిగిన దృశ్యం

పోలీసు సిబ్బంది నివాసం కోసం రూ.కోట్ల నిధులు వెచ్చించి గాజువాక దరిపెదగంట్యాడ బీసీరోడ్డు పక్కన విశాలమైన స్థలంలో నిర్మించిన గృహ సముదాయం(క్వార్టర్స్‌) శిథిలమై నేడో, రేపో కూలడానికి సిద్ధంగా ఉంది.

ఆయా భవనాల్లో ఉండలేక ఉద్యోగులు ఇప్పటికే ఖాళీ చేయగా... కట్టడాల ఆస్తులు ఒక్కొక్కటీ పరుల పాలయ్యాయి. ప్రస్తుతం ఆకతాయిలు, మందుబాబులకు అడ్డాగా తయారైంది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శిథిల భవనాలు కూలక ముందే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

జీర్ణావస్థలో ఉన్న వాటర్‌ ట్యాంకు

దిక్కులు చూస్తూ..
* 1991లో నగరంలోని పోలీసు సిబ్బంది (ఎస్సై, పీసీ స్థాయి) కోసం బీసీరోడ్డు పక్కన 10.60 ఎకరాల విస్తీర్ణంలో 220 క్వార్టర్లను ఏపీ పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నిర్మించారు.
*ఇక్కడి సముదాయాలకు ఆకట్టుకునేలా రెండు ముఖద్వారాలు, 150 కేఎల్‌ సామర్థ్యం గల ఓవర్‌ హెడ్‌ ట్యాంకు, ఆరు బ్లాకులు, విశాలమైన రహదారులు, ఇరువైపులా చెట్లు... ఇలా చూడచక్కగా ఉండేది.
*అయితే తక్కువ కాలానికే పైపులైన్ల వ్యవస్థ పాడైపోయి చుక్క నీటికి నివాసితులు దిక్కులు చూడాల్సి వచ్చేది. దీనికితోడు డ్రైనేజీ అవుట్‌లెట్‌ లేక మురుగు నీరంతా ఇళ్ల ఎదుటే నిలిచి పోవడంతో ఇక్కడ ఉండడానికి ఎవరూ ఇష్టపడ లేదు.
* గత ఆరేళ్లుగా నివాసాలు శిథిలావస్థకు చేరుకోవడంతో సిబ్బంది ఒక్కొక్కరూ ఖాళీ చేయడం మొదలు పెట్టారు. ప్రతి క్వార్టర్‌ గోడలు బీటలు వారి, వర్షం వస్తే కారుతోంది.  ఓవర్‌ హెడ్‌ ట్యాంకు ధ్వంసం కావడంతో పాటు పంపుహౌస్‌ సామగ్రి దొంగల పాలైంది.
*నాటి సౌత్‌ సర్కిల్‌ పరిధిలోని గాజువాక, న్యూపోర్టు, దువ్వాడ, స్టీల్‌ప్లాంటు, పరవాడ, గోపాలపట్నం, పెందుర్తి, హార్బర్‌, మల్కాపురం పోలీస్‌స్టేషన్ల సిబ్బంది ఇక్కడే ఉంటూ విధులకు వెళ్లేవారు.
* క్వార్టర్స్‌కు నిర్వహణ కొరవడడంతో ఆయా సిబ్బంది ప్రత్యామ్నాయాలు చూసుకున్నారు. ఎక్కడికక్కడ గదులు ఖాళీగా ఉండడంతో ఆకతాయిలు, మందుబాబులు తిష్ఠ వేస్తున్నారు.
* క్వార్టర్స్‌ను పూర్తిగా నేలమట్టం చేసి గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రంగా, లేదా ఏఆర్‌ సబ్‌ కంట్రోల్‌ కార్యాలయంగా మార్చాలన్న ప్రతిపాదన ఏళ్ల తరబడి కాగితాలకే పరిమితమైంది.
* దయనీయంగా ఉన్న ఈ క్వార్టర్స్‌ను విశాఖ మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంటు అథారిటీ(వీఎంఆర్‌డీఏ)కి పూర్తిగా ఆప్పగించి, నగర శివారులో ప్రత్యామ్నాయ స్థలం తీసుకోవడానికి పోలీసుశాఖ యోచిస్తున్నట్లు సమాచారం.
* దీనిపై న్యూపోర్టు పీఎస్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.రాము వివరణ కోరగా.... పోలీసు క్వార్టర్స్‌ దుస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని చెప్పారు. ఆకతాయిల తాకిడి లేకుండా సాయంత్రం వేళ ఓ కానిస్టేబుల్‌కు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తామన్నారు.


1997లో అప్పటి విశాఖ నగర పోలీసు కమిషనర్‌ కోడె దుర్గాప్రసాద్‌ హయాంలో పెదగంట్యాడ క్వార్టర్స్‌ సుందరీకరణ పనులు చేపట్టారు.


సామాజిక భవనం, బస్‌స్టాపు నిర్మాణంతో పాటు కొంతమేర ఇళ్లకు మరమ్మతులు జరిగాయి. ఆ తర్వాత నుంచి అతీగతీ పట్టించుకున్న వారు లేరు.

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని