logo
Updated : 30 Oct 2021 10:46 IST

AP News: భార్య మృతదేహంపై పడి భర్త కన్నుమూత..

గంటల వ్యవధిలో తీరని విషాదం

సింగంశెట్టి వెంకటరమణ, భవాని దంపతులు

కలిసే జీవించారు.. కలిసే తనువు చాలించారు. మరణంలోనూ వారి బంధం విడిపోలేదు. జీవితాంతం ఒకరికొకరు కష్టసుఖాల్లో కలిసి పయనిద్దాం.. జీవిత చరమాంకం వరకు తోడూ నీడగా ఉందామంటూ వివాహ బంధంతో ఒక్కటై.. అన్యోన్య దాంపత్యం కొనసాగించిన ఆ ఇద్దరూ జంటగానే మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. గంటల వ్యవధిలో ఇద్దరూ లోకాన్ని వీడిన విషాద ఘటన రావికమతంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.

వర్ధన్‌ను ఓదారుస్తున్న బంధువులు

సింగంశెట్టి భవాని (51) అనారోగ్యంతో మృతి చెందగా.. ఆమె మరణాన్ని తట్టుకోలేక భర్త వెంకటరమణ (56) గుండెపోటుతో తనువు చాలించారు. వీరికి 35 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. సంతానం కలగకపోవడంతో భవాని అక్క మనుమడు వర్ధన్‌ (14)ను దత్తత తీసుకున్నారు. వెంకటరమణ స్థానిక సాయిబాబా గుడి సమీపంలో కిరాణా, ఫ్యాన్సీ వ్యాపారం నిర్వహిస్తున్నారు. భవాని మధుమేహం, రక్తపోటు, ఆయాసంతో అనారోగ్యానికి గురయ్యారు. గురువారం రాత్రి రెండు గంటల సమయంలో ఆయాసం ఎక్కువ కావడంతో చోడవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఉదయం ఆరు గంటల సమయంలో మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. విగతజీవిగా మారిన భార్యను చూసి వెంకటరమణ తట్టుకోలేకపోయారు. ఆమె మృతదేహంపై పడి రోదిస్తుండగా గుండెపోటు రావడంతో హఠాన్మరణం చెందారు. తల్లిదండ్రులిద్దరూ ఒకేరోజు చనిపోవడంతో వర్ధన్‌ ఒంటరి వాడయ్యాడు. ఇతను తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.  దంపతులకు వారి బంధువులుఅంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఆదర్శ దంపతులను కడసారి చూసేందుకు సమీప గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు.

- న్యూస్‌టుడే, రావికమతం

 

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని