logo
Updated : 22 Nov 2021 08:41 IST

AP News: విశాఖలో ఆ వేళలో రోడ్లపైకి వస్తే.. వేలి ముద్ర వేయాల్సిందే!

న్యూస్‌టుడే, ఎంవీపీకాలనీ: విశాఖ నగరంలో రాత్రి పది గంటల తరువాత రోడ్డుపైకి వస్తే పోలీసులు మిమ్మల్ని ఆపొచ్ఛు..మీ దగ్గర గుర్తింపు కార్డులు లేకుంటే మీ వేలి ముద్రలు తీసుకొని పంపించొచ్చు.. ఇంకా అనుమానముంటే స్టేషన్‌కు కూడా తరలించొచ్చు!! అవును...ఇలాంటి పరిస్థితులు ఇప్పటికే చాలా మందికి ఎదురయ్యాయి. నేరగాళ్ల ఆగడాల కట్టడికి సీపీ మనీశ్‌కుమార్‌ సిన్హా ఈ వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయాలని స్పష్టం చేశారు. గత రెండు నెలలుగా ఈ విధానం కొనసాగుతోంది. 


ఇతర జిల్లాలకూ సమాచారం 

నగరంలో చోరీలు, హత్యలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలతో సంబంధం ఉన్నవారిని గుర్తించి... వారి కదలికలపై నిఘా ఉంచటం ద్వారా నేరాలపై నియంత్రణ సాధించొచ్చని నగర పోలీసు విభాగం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. నగర పరిధిలో రాత్రి వేళ నిత్యం 100 నుంచి 120 మంది వేలిముద్రలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో పాత నేరస్తులు దాదాపు ఐదారుగురిని నిత్యం గుర్తిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చిన్నచిన్న దొంగతనాలకు పాల్పడిన వారి వేలి ముద్రలు కూడా విధిగా సేకరించి సర్వర్‌లో పొందుపరుస్తున్నారు. రాత్రి వేళ తీసుకుంటున్న వాటితో అవి జతయితే వెంటనే వారిని స్టేషన్‌కు తరలిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పాత నేరస్తులను గుర్తిస్తే తక్షణం ఆ జిల్లా పోలీసులకు సమాచారం ఇస్తున్నారు. ఆ నేరస్తులు ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చారు? వారు చెబుతున్న కారణం వాస్తవమేనా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. 


నేరాలతో సరిపోల్చుతూ..

ఈ ప్రక్రియ కోసం 68 వరకు ‘నైట్‌ సెక్యూరిటీ చెక్‌ డివైజ్‌’లను ఉపయోగిస్తున్నారు. వీటిని ఒక్కో స్టేషన్‌కు మూడు చొప్పున అందశారు. శాంతిభద్రతల విభాగం, నేర విభాగం, బ్లూకోట్స్‌ విభాగం వద్ద మరికొన్ని ఉంచారు. అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులు, నేరం జరిగిన చోట తిరిగే వారి వేలిముద్రలు సేకరించి సర్వర్‌కు జత చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జరిగిన నేరాలకు సంబంధించి నిందితులను గుర్తించేందుకు ఈ వేలిముద్రలతో ఎప్పటికప్పుడు సరిపోల్చుతున్నారు. ప్రతీ రోజూ ఉదయం ఆరు గంటలకల్లా దీనిపై నివేదిక సిద్ధం చేస్తున్నారు. 


గుర్తింపు కార్డులుండాలి 

పర్యాటక ప్రాంతమైన విశాఖ నగరానికి దేశం నలుమూలల నుంచీ రాత్రి సమయంలో వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటీవల కొన్ని ఏటీఎంలు, హుండీల సొమ్ములు చోరీ చేసిన వారి శైలి గమనిస్తే.. విమానాల్లోనూ ఇక్కడికి వచ్ఛి..రాత్రి వేళల్లో అద్దె బైకులపై తిరిగి.. వారనుకున్న ప్రాంతంలో రెక్కీ నిర్వహించి సొమ్ములు కాజేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. అయితే తనిఖీ సమయంలో కొందరు సహకరించటం లేదని పోలీసులు పేర్కొంటున్నారు. రాత్రి సమయంలో తిరిగే ప్రతి ఒక్కరి వద్ద ఆధార్‌తో పాటు తగిన గుర్తింపు కార్డులు ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టటానికి కాదని, నేరస్తులను గుర్తించటం ద్వారా నేరాలను అదుపు చేయటానికే తమ తనిఖీలు కొనసాగుతున్నాయని చెబుతున్నారు.


 

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని