logo
Published : 28/11/2021 04:03 IST

చిత్రవార్తలు

శునకం.. ఇక తప్పించుకోలేదులే!

విశాఖపట్నానికి చెందిన డాక్టర్‌ రాజీవ్‌ కుక్కలు, పిల్లులు, ఆఫ్రికన్‌ చిలుకలను చాలా ఆప్యాయంగా పెంచుతుంటారు. అందుకే వాటి రక్షణ బాధ్యతలపైనా ఎంతో శ్రద్ధ పెట్టారు. చీకటిలో కనిపించేలా కుక్కల మెడలో చిన్న ఎల్‌ఈడీ దీపాలను...అవి ఎక్కడున్నాయో ఎప్పటికప్పుడు తెలిసేలా జీపీఎస్‌ పరికరాలను జత చేసి తన సెల్‌ఫోనుకు అనుసంధానించారు.

- ఈనాడు, విశాఖపట్నం


అన్ని‘దిశ’లా రక్షణంటూ...

ఇటీవల మహిళలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కళాశాలలకు వెళ్లే యువతుల సెల్‌ఫోన్లలో ‘దిశ’యాప్‌ ఉంటే కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. శనివారం ఆర్కేబీచ్‌ రోడ్డులో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించి అవగాహన కల్పిస్తున్న మహిళా పోలీసులను చిత్రంలో చూడొచ్చు.

-న్యూస్‌టుడే, విశాఖపట్నం.


బాలలు.. పడిలేచే కెరటాలు..

చక్రాల బూట్లు కాళ్లకు తగిలించి రివ్వున దూసుకుపోవడమంటే ఎవరికిష్టముండదు. పిల్లలకయితే అది మహాసరదా. అందుకే సాగర తీరంలో స్కేటింగ్‌లో మెలకువలు నేర్చుకునేందుకు పెద్దలతో...శిక్షకులతో కలిసి చిన్నారులు ఎందరో వస్తున్నారు. పడుతూ...లేస్తూ.. చూడముచ్చటగా ...ఉత్సాహంగా చేసిన వారి విన్యాసాలు శనివారం అబ్బురపరిచాయి(చిత్రాల్లో).

-ఈనాడు, విశాఖపట్నం


 నడిచొచ్చే..  హొయలొలికించే..

నగరంలోని బీచ్‌రోడ్డులోని ఓ వేదికపై శనివారం మోడల్స్‌ ర్యాంప్‌ వాక్‌ చేశారు. పలువురు డిజైనర్లు రూపొందించిన వస్త్రాలు ధరించి ర్యాంప్‌పై హొయలొలికించారు. 

  -న్యూస్‌టుడే, ఎంవీపీకాలనీ


ఘనంగా అయ్యప్పస్వామి అంబలం పూజ

అనకాపల్లిలోని నర్సింగరావుపేటలో అయ్యప్పస్వామి అంబలం దివ్య  పడిమెట్ల పూజా మహోత్సవాన్ని శనివారం రాత్రి వైభవంగా నిర్వహించారు.  స్వామి ముత్యాల వెంకటేశ్వరరావు (ఎంవీఆర్‌) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి భారీగా అయ్యప్ప మాలధారులు పాల్గొన్నారు. 18 మెట్లతో ఏర్పాటుచేసిన సెట్టింగ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నిర్వాహకులు ముత్యాల వెంకటేశ్వరరావు కుటుంబసభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. స్వాములు ఆలపించిన భక్తి గీతాలు అలరించాయి.

-అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే


నీటిపై తేలియాడుతూ ఆసనాలు

నీటిపై తేలుతూ వివిధ ఆసనాలు వేస్తుంటారు కొండపాలెం గ్రామానికి చెందిన ముచ్చకర్ల వరహా నాగేశ్వరరావు. 20 ఏళ్ల నుంచి ఆంజనేయస్వామి మాల వేస్తుంటారు. బుద్ధాసనం వేస్తూ హనుమాన్‌ చాలీసా, రామనామస్మరణ చేస్తూ ఎంతసేపైనా నీటిపై తేలుతూ ఉంటారు. సద్గురు రామానందను చూసి నేర్చుకున్నానని, దీనివల్ల ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు.

-బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే


విశాఖలో శనివారం ర్యాంప్‌పై హొయలొలికిస్తున్న మోడల్స్‌ 

- న్యూస్‌టుడే, విశాఖపట్నం

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని