logo
Published : 28/11/2021 04:03 IST

బండి బోల్తాతో గంజాయి గుట్టురట్టు

  బోల్తా పడిన వాహనం

హుకుంపేట, న్యూస్‌టుడే: బండి బోల్తా పడటంతో గంజాయి గుట్టు బయటపడింది.  ఎస్సై నాయుడు కథనం ప్రకారం.. ఉప్ప మీదుగా గంజాయి తరలిస్తుండగా మారెల గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి వ్యాన్‌ బోల్తా పడింది.  శనివారం  ఈ ప్రమాదంపై పోలీసులకు సమాచారం అందించారు. భారీగా గంజాయి బస్తాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఎస్సై అక్కడకు చేరుకుని గంజాయి బస్తాలను హుకుంపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
అనంతగిరి, న్యూస్‌టుడే:  కూరగాయల మాటున వాహనంలో తరలిస్తున్న సుమారు 780 కేజీల గంజాయిని అరకులోయ ఎస్‌ఈబీ పోలీసులు పట్టుకున్నట్లు సీఐ గణపతిబాబు తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు వెంకయ్యపాలెం సమీపంలో మాటు వేసి తనిఖీలు చేపట్టగా వ్యాన్‌లో తరలిస్తున్న గంజాయి పట్టుబడింది. దీని విలువ రూ.40లక్షలు ఉంటుందన్నారు. కొరాపుట్‌కు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
కృష్ణదేవిపేట: స్థానిక జీసీసీ పెట్రోల్‌ బంకు వద్ద  బైక్‌పై తరలిస్తున్న 24 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సూర్యనారాయణ పేర్కొన్నారు. పడమట శ్యామ్‌, పృధ్వీరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని