logo
Published : 28/11/2021 04:03 IST

5,500 ఎకరాల్లో గంజాయి తోటల ధ్వంసం

జేడీ సతీష్‌కుమార్‌

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా ప్రభుత్వ ఆదేశాలతో చేపడుతున్న ఆపరేషన్‌ పరివర్తన కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 5,500 ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం చేసినట్లు సెబ్‌ జేడీ సతీష్‌కుమార్‌ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. ఏజెన్సీలో ఎనిమిది మండలాల్లో 28 రోజులుగా గంజాయి తోటలను తొలగించడం, గిరిజనులకు అవగాహన కల్పించడం చేస్తున్నామన్నారు. స్థానికులే స్వచ్ఛందంగా 360 ఎకరాల్లో గంజాయిని ధ్వంసం చేసి ఆదర్శంగా నిలిచారన్నారు. వీరికి ఐటీడీఏ, ఉద్యానశాఖ, వ్యవసాయశాఖ నుంచి ప్రత్యామ్నయ జీవనోపాధి చూపిస్తామని చెప్పారు. గత నాలుగైదు నెలల్లో సుమారు 23 వేల కేజీ గంజాయి రవాణాను అడ్డుకున్నామన్నారు. 60 కేజీల ద్రవరూపం గంజాయి (హసిస్‌ ఆయిల్‌)ని పట్టుకున్నట్లు చెప్పారు. గ్రామీణ జిల్లాలో 10, పట్టణంలో ఏడు సెబ్‌ స్టేషన్లు ఉన్నాయని అనునిత్యం గంజాయి రవాణాపై నిఘా పెడుతున్నామని అన్నారు.

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని