logo
Published : 28/11/2021 04:03 IST

‘రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత విమర్శలు’

రోడ్డుపై బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే ఈశ్వరి, నేతలు

కొయ్యూరు, న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబు సతీమణిపై అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసిన నాయకులు వెంటనే క్షమాపణలు చెప్పాలని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి డిమాండ్‌ చేశారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్‌ అతిథి గృహానికి ఎదురుగానున్న ప్రధాన రహదారిపై జీసీసీ మాజీ ఛైర్మన్‌ ఎంవీవీ ప్రసాద్‌, కార్యకర్తలతో కలిసి బైఠాయించి నిరసన తెలిపారు. ఈశ్వరి మాట్లాడుతూ వైకాపా శాసనసభను కౌరవ సభగా మార్చేసిందని విమర్శించారు. వైకాపా అసమర్థ పాలనతో రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తెదేపాను రాజకీయంగా ఎదుర్కోలేకే వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారన్నారన్నారు. హామీలు నెరవేర్చలేక, మూడు రాజధానులు, ఇతర అంశాలపై వైకాపా ప్రభుత్వం మైండ్‌ గేమ్‌ ఆడుతోందని జీసీసీ మాజీ ఛైర్మన్‌ ఎంవీవీ ప్రసాద్‌ విమర్శించారు. మాజీ ఎంపీపీ జి.సత్యనారాయణ, జడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీరామ్మూర్తి, మండల తెదేపా అధ్యక్షుడు రామ్మూర్తి, తెలుగు రైతు కార్యదర్శి లోతా భీమరాజు, శ్రీనుబాబు, ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.
‘మహిళల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం’
విశాఖపట్నం, న్యూస్‌టుడే: మహిళల హక్కులను వైకాపా ప్రభుత్వం కాలరాస్తోందని తెదేపా విశాఖ లోక్‌సభ నియోజకవర్గ మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి సర్వసిద్ధి అనంతలక్ష్మి అన్నారు. శనివారం విలేకర్లతో మాట్లాడుతూ నర్సీపట్నంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న తనపై కొంతమంది మహిళా పోలీసులు అవమానకరంగా వ్యవహరించారన్నారు. చీర లాగి ఆటోలోకి నెట్టేశారన్నారు. ఆ సమయంలో అయ్యన్నపాత్రుడు రక్షించారన్నారు.  వైకాపా ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు వచ్చాయన్నారు.

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని