logo
Published : 28/11/2021 05:11 IST

18 టన్నుల రాక్‌ఫాస్పేట్‌ స్వాధీనం

పోలీసులు స్వాధీనం చేసుకున్న సరకు

అగనంపూడి, న్యూస్‌టుడే : ఆటోనగర్‌ ఎఫ్‌-బ్లాకులోని ఓ గోదాములో అక్రమంగా నిల్వ ఉంచిన 18 టన్నుల రాక్‌ఫాస్పేట్‌ను దువ్వాడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలు... కంచరపాలెం ప్రాంతానికి చెందిన మామిడి లక్ష్మి (అలియాస్‌ బొగ్గు లక్ష్మి), అల్లిపురం ప్రాంతానికి చెందిన లారీడ్రైవర్లు చుక్క దుర్గావరప్రసాద్‌, బొడ్డు నర్సింగ్‌తో కలిసి పోర్టు నుంచి రాక్‌ఫాస్పేట్‌ను చోరీ చేశారు. రూ.1.50లక్షల విలువైన సరకును ఆటోనగర్‌లో నిల్వ ఉంచారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. సరకును స్వాధీనం చేసుకుని, ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించామన్నారు. ప్రధాన నిందితురాలు మామిడి లక్ష్మిపై కంచరపాలెం స్టేషన్‌ పరిధిలో 13 పాత కేసులు, రౌడీషీట్‌ ఉన్నట్టు దువ్వాడ పోలీసులు తెలిపారు.

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని