logo
Published : 28/11/2021 04:03 IST

మంత్రి కొడాలి నానిపై గాజువాకలో ఫిర్యాదు

న్యూపోర్టు ఎస్‌ఐ మన్మథరావుకు ఫిర్యాదు చేస్తున్న తెదేపా నాయకులు

విశాఖపట్నం(గాజువాక), న్యూస్‌టుడే : తెదేపా అధినేత చంద్రబాబునాయుడుకి జెడ్‌ ప్లస్‌ భద్రతను తొలగిస్తే...లారీలతో తొక్కిస్తామంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు(నాని)పై తక్షణమే కేసు నమోదు చేయాలని గాజువాక తెదేపా కమిటీ ప్రతినిధులు శనివారం రాత్రి న్యూపోర్టు స్టేషన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెదేపా గాజువాక సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో తొలుత నాయకులంతా మంత్రి తీరుకు వ్యతిరేకంగా నినదించారు. అనంతరం ఎస్‌ఐ మన్మథరావుకు ఫిర్యాదు చేశారు. తెదేపా నగర నాయకులు శ్రీనివాసవర్మ, గోమాడ వాసు, బలగ బాలునాయుడు, తెలుగు మహిళ గాజువాక అధ్యక్షురాలు సిగటాపు సుజాత, స్వరూప తదితరులు పాల్గొన్నారు.

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని