logo
Published : 28/11/2021 04:27 IST

పరుగులుతీసే వయసు..!

88పడిలోనూ సామాజిక స్పృహ భేష్‌..!

డాక్టర్‌ రామకృష్ణ

వయసు మీద పడింది కదా... ఆధ్యాత్మిక భావనలతో  ఇంటిపట్టునే ఉండక కుర్రాడిలా ఆ పరుగులేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే.... ఆ 88 ఏళ్ల వయోవృద్ధుడు ‘నాకేం తక్కువ..?’ అంటూ ఎదురు ప్రశ్నిస్తారు. నా వేగం చూస్తారా అంటూ ఇంటి ఆవరణలోని కారు తీసి రయ్‌..మంటూ రద్దీ మార్గాల్లో దూసుకుపోతారు.  వీధుల్లో ఉదయం, సాయంత్రం నడక సాగిస్తుంటే... చూసిన వారంతా నోరెళ్లబెడతారు. ఎక్కడైనా ప్రజా సమస్య ఉందంటే... దాని పరిష్కారం కోసం శ్రమిస్తూనే ఉంటారీ గాజువాకకు చెందిన రామకృష్ణ.

న్యూస్‌టుడే, గాజువాక

గాజువాక వుడాకాలనీకి చెందిన డాక్టర్‌ పి.రామకృష్ణ 1933 జనవరి 14న జన్మించారు. 1952లో మద్రాస్‌లో వెటర్నరీ కళాశాలలో విద్య పూర్తి చేసి.. 1958లో వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌గా విశాఖ ఏజెన్సీ చింతపల్లిలో పని చేశారు. ఆ తర్వాత 1975లో పదోన్నతిపై కర్నూలు వెళ్లారు. అక్కడ నుంచి వివిధ జిల్లాల్లో పని చేశారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ హోదాలో 1991లో పదవీ విరమణ చేసి గాజువాక వినాయకనగర్‌ వుడాకాలనీలో సొంతిట్లో ఉంటున్నారు. భార్య సరస్వతి 2012లో కన్నుమూయడంతో ఒంటరిగానే జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు సంతానం. ఉద్యోగరీత్యా వారు వేర్వేరు రాష్ట్రాల్లో ఉంటున్నారు.

సామాజిక బాధ్యతగా...
ఆంగ్లభాషలో అనర్గళంగా మాట్లాడే ఈ పెద్దాయన నిత్యం చలాకీగా ఉంటూ క్రమశిక్షణ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతి సోమవారం గాజువాక జెడ్సీ, జిల్లా కలెక్టరేట్‌, పోలీసుశాఖ కార్యాలయాల్లో నిర్వహించే గ్రీవెన్స్‌ల్లో వివిధ వినతులతో ప్రత్యక్షమవుతారు.  సామాజిక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి... పరిష్కారమయ్యే వరకూ నిద్రపోరు.
* జాతీయ రహదారి ఎన్‌ఏడీ కూడలిలో ట్రాఫిక్‌ కష్టాలపై ఆరేళ్ల పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశారు. పరిశ్రమల కాలుష్యంపై పీయూసీ బోర్డు అధికారులకు పలుమార్లు నివేదించారు. వర్షాలొస్తే నీటి ముంపునకు గురయ్యే పాతగాజువాక కూడలి సంగతి తేల్చాలంటూ జీవీఎంసీ అధికారులకు పదేపదే వినతులు అందజేస్తున్నారు.
* నగర వ్యాప్తంగా రహదారుల పక్కన లారీలు, ట్యాంకర్ల అనధికార పార్కింగ్‌పైనా చర్యలు తీసుకోవాలంటూ పోలీసు శాఖపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇటీవల గాజువాకలో యూజీడీ గోతులతో రహదారులు ఛిద్రమైన వ్యవహారాన్ని అధికారులకు విన్నవించి... కొన్నిచోట్ల పనులు జరిగే చూశారు.
జీవన  విధానంలో క్రమశిక్షణ
* నియమిత ఆహారపు అలవాట్లు, క్రమశిక్షణతో కూడిన జీవన విధానం, రోజూ ఏదో ఒక వ్యాపకంలో తలమునకలయ్యే డాక్టర్‌ రామకృష్ణ నేటి యువతరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తెల్లవారు జామున 4 గంటలకు నిద్రలేచి కాసేపు నడక సాగిస్తారు. ఆ తర్వాత పెరటి మొక్కల సంరక్షణ, ఇంటి పనిలో పూర్తిగా నిమగ్నమవుతారు. ఆహారపు అలవాట్లు, కంటి నిండా నిద్ర, శరీరానికి సరిపడా వ్యాయమంతోనే ఆరోగ్య సమస్యలు దరి చేరవని ఆయన చెబుతున్నారు. తనకు మొదటినుంచీ కారు డ్రైవింగ్‌ అంటే ఇష్టమని, కనీసం పాల ప్యాకెట్టు తెచ్చుకోవడానికైనా కారులోనే వెళ్తానంటున్నారు రామకృష్ణ.

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని