గోపాలపట్నంలో భారీ చోరీ
70 తులాల బంగారం, 8 కిలోల వెండి, రూ.15 లక్షల నగదు మాయం
గోపాలపట్నం, న్యూస్‌టుడే: గోపాలపట్నంలో జరిగిన భారీ చోరీ కలకలం రేపింది. బాధితుల వివరాల ప్రకారం.. జనతాకాలనీకి చెందిన వైకుంఠరావు, నాగమణి దంపతులు గోపాలపట్నం బీఆర్టీఎస్ రోడ్డులో పూజ సామగ్రి దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయాన్నే దుకాణానికి వెళ్లిగా, కుమార్తె పాఠశాలకు వెళ్లింది. సాయంత్రం గ్యాస్ డెలివరీ బాయ్ వచ్చి చూడగా... వైకుంఠరావు ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. సమాచారం అందుకున్న అతడు ఇంటికి వచ్చి...బీరువాలో ఉండాల్సిన 70 తులాల బంగారం, రూ.15 లక్షల నగదు, 8 కిలోల వెండి చోరీకి గురైనట్టు గుర్తించి.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రైం డీసీపీ శ్రావణ్‌కుమార్, ఏసీపీలు పెంటారావు, శ్రీపాదరావు, సీఐలు లూధర్‌బాబు, మళ్ల అప్పారావు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అయితే మధ్యాహ్నం కారులో గుర్తుతెలియని వ్యక్తులు స్థానికంగా సంచరించారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసుల తెలిపారు.