logo
Published : 28/11/2021 04:27 IST

అదిగో.. హెచ్చరిక!

పూర్తిగా తొలగని కొవిడ్‌ ముప్పు
జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు
న్యూస్‌టుడే, వన్‌టౌన్‌

ఈ ఏడాది మార్చి నుంచి మే వరకు కొవిడ్‌ రెండో దశ విశాఖను కుదిపేసింది. తర్వాత క్రమేణా దాని ప్రభావం నుంచి బయట పడ్డామనుకుంటున్నా.. కొందరు కొవిడ్‌ నియమావళి పట్టించుకోవడం లేదు. మాస్క్‌లు ధరించడం మానేశారు. కొత్త వేరియంట్‌ పుట్టుకొస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా లేకుంటే మూడో దశ ముప్పు తప్పేలా లేదని వైద్య వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

జిల్లాలో ఇంకా 18ఏళ్ల లోపు పిల్లలకు  టీకాలు వేయలేదు. 18ఏళ్లు పైబడిన వారిలో 21 లక్షల మందికి రెండు డోసులు, 30 లక్షల మందికి తొలిడోసు టీకాలు వేశారు. దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ వెలుగుచూసిన నేపథ్యంలో నగర యంత్రాంగం అప్రమత్తమైంది. ఇతర దేశాల నుంచి వచ్చే వారిపై దృష్టి పెడుతోంది. ఇప్పటికే విమానాశ్రయంలో కొవిడ్‌ పరీక్షలు చేసేందుకు అవసరమైన వసతులున్నాయి. అధికారికంగా ఎటువంటి ఉత్తర్వులు రాకున్నప్పటికీ విశాఖకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా అప్రమత్తం కావల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి.- తొలిదశ 54వేల కేసులు: జిల్లాలో 2020

మార్చి నుంచి అక్టోబరు వరకు విజృంభించింది. అప్పటిలో తొలి మూడు నెలలు సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు కావడంతో పెద్దగా ముప్పు ఏర్పడలేదు. అయినప్పటికీ తొలిదశలో 54వేల వరకు కొవిడ్‌ కేసులు జిల్లాలో నమోదయ్యాయి. 500 మందికి పైగా మృతి చెందారు.

జిల్లాలో టీకాలు ఇలా..
మొదటి డోసు:  30,74,655
రెండు డోసులు: 21,38,470

* రెండో దశ భయానకం: కరోనా ఇక తగ్గిందనుకుంటున్న తరుణంలో ఈ ఏడాది మార్చి నుంచి విజృంభించింది. అప్రమత్తం అయ్యేలోపు పంజా విసిరింది. ఈ దశలో జిల్లా వ్యాప్తంగా దాదాపు లక్షకుపైగా కేసులు వచ్చాయి. అధికారికంగా ఆరువందల మంది వరకు మృతి చెందారు. అనధికారికంగా వేల సంఖ్యలో కన్నుమూశారు
* అప్రమత్తతేదీ:  ఇప్పటికీ రోజూ కేసులు నమోదవుతున్నాయి. శనివారం కూడా 15 నమోదయ్యాయి. బీచ్‌రోడ్డుకు శని, ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో వేల సంఖ్యలో సందర్శకులు వస్తున్నారు. అధిక శాతం మాస్క్‌ ధరించకోవడం గమనార్హం.
ముప్పు తొలగిపోలేదు...
టీకాలు తీసుకున్నప్పటికీ కొవిడ్‌ ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ప్రమాదకరమైన ఒమిక్రాన్‌ వంటి వేరియంట్ల నుంచి ముప్పు పొంచి ఉంది. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. గుమికూడి ఉండడం, మాస్కు లేకుండా విచ్చలవిడిగా తిరగడం చేయరాదు.

- డాక్టర్‌ పీవీ సుధాకర్‌, ఏంఎసీ ప్రిన్సిపల్‌

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని