logo
Published : 28/11/2021 04:27 IST

ఎక్కడికక్కడ..ఇష్టారాజ్యం

ఎలా కోరితే అలా ధ్రువీకరణ పత్రాల మంజూరు
కేజీహెచ్‌ ఉద్యోగి ఉదంతంపై విచారణ

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే:  కేజీహెచ్‌లో తప్పుడు ధ్రువపత్రాలతో ఉద్యోగం పొందిన మహిళకు అవి ఎలా వచ్చాయనే అంశంపై రెవెన్యూ వర్గాలు ఆరా తీస్తున్నాయి. కేజీహెచ్‌లో నాలుగో తరగతి ఉద్యోగిగా పని చేసిన శివకుమార్‌ గత ఏడాది మృతి చెందారు. అతనికి చెల్లెలి వరసైన మహిళ... తాను భార్యనని పేర్కొంటూ కారుణ్య నియామకానికి అవసరమైన పత్రాలను తహసిల్దార్‌ కార్యాలయం నుంచి పొందింది. వాటి ఆధారంగా కేజీహెచ్‌లో గత ఏడాది ఆగస్టులో కార్యాలయ సబార్డినేట్‌గా ఉద్యోగం పొందింది. జీతభత్యాలకు అవసరమైన పాన్‌కార్డును తేవడంలో విఫలమైంది. దీంతో కేజీహెచ్‌ వర్గాలు ఆరా తీయగా వాస్తవాలు బయటపడ్డాయి.  కేజీహెచ్‌ పర్యవేక్షక వైద్యాధికారిణి డాక్టర్‌ మైథిలి కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు. ఈ అంశంపై ‘ఈనాడు’లో వచ్చిన కథనం కలెక్టర్‌ దృష్టికి వెళ్లడంతో తహసిల్దార్‌ కార్యాలయం జారీ చేసిన ధ్రువపత్రంపై ఆరా తీయాలని నిర్ణయించారు. విచారణ అధికారిగా ఆర్డీఓ పెంచలకిషోర్‌ను నియమించామని జేసీ ఎం.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.
* ధ్రువపత్రాల కోసం తొలుత ఆ మహిళ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేశారు. విచారణ జరిపి తహసిల్దార్‌ కార్యాలయ అధికారులు ఫ్యామిలీ  మెంబర్‌, నోఎర్నింగ్‌ ధ్రువపత్రం జారీ చేశారు. ఆధార్‌కార్డులో సైతం శివకుమార్‌ భార్యగా పేరు మారింది. ఒక ఉన్నత పాఠశాల జారీ చేసిన 9వ తరగతి సర్టిఫికెట్‌లో సైతం ఆమె ఇంటి పేరు మార్చి ఇచ్చారు. పలు కార్యాలయాల్లో దీనికి సంబంధించిన తంతు నడిచింది.  సాధారణంగా ఫ్యామిలీ మెంబరు ధ్రువపత్రం విషయంలో క్షేత్రస్థాయిలోకి వెళ్లి విచారణ చేయాలి.  మృతుని కుటుంబ సభ్యుల వివరాలను సేకరించాలి. ఇవన్నీ చేయకుండానే మంజూరు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని